అమరావతి ఎయిర్ షో-2018 అద్భుతంగా సాగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. విమానాల విన్యాసాలను చూస్తుంటే తనకు పైలెట్ కావాలని...
అమరావతి ఎయిర్ షో-2018 అద్భుతంగా సాగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. విమానాల విన్యాసాలను చూస్తుంటే తనకు పైలెట్ కావాలని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. దేశంలోనే నైపుణ్యమున్న యువత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎయిర్ షో వేడుకలు ముగిశాయి.నగరవాసులకు ఎయిర్ షో కనువిందు చేస్తుంది. ఆఖరి రోజు సీఎం కూడా ఎయిర్ వీక్షించారు. ముగింపు కా ఎయిర్ షో చూసేందుకు నగరవాసులే కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్నారు.
విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆనంద సూచీలో అగ్రస్థానంలో నిలిపామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వేదికగా నిర్వహించిన విమాన విన్యాసాలు తిలకించిన అనంతరం మాట్లాడిన సీఎం.. విమాన విన్యాసాల్లో అంతర్జాతీయంగా పేరున్న గ్లోబల్ స్టార్ సంస్థ ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవలే సోషల్ మీడియా సమ్మిట్, ఎఫ్ 1 బోట్ రేసింగ్ విజయవాడలో నిర్వహించామని వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. బోట్ రేసింగ్ పోటీలకు ఇంతటి అనువైన ప్రాంతం ప్రపంచంలో ఎక్కడా లేదని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతిలో ప్రజలకు నిత్యం వినోదం, ఆహ్లాదం పంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం చూస్తుంటే తనకూ పైలట్ కావాలన్న కోరిక కలుగుతోందని సరదాగా వ్యాఖ్యానించారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వేదికగా రెండు రోజులుగా జరుగుతునన గ్లోబల్ స్టార్ ఎయిర్ షో విన్యాసాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆనంద సూచీలో అగ్రస్థానంలో నిలిపామన్నారు.ఇటీవలే సోషల్ మీడియా సమ్మిట్, ఎఫ్ 1 బోట్ రేసింగ్ విజయవాడలో నిర్వహించామని వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. బోట్ రేసింగ్ పోటీలకు ఇంతటి అనువైన ప్రాంతం ప్రపంచంలో ఎక్కడా లేదని అభిప్రాయపడ్డారు. అమరావతిలో ప్రజలకు నిత్యం వినోదం, ఆహ్లాదం పంచే కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. విమానాల విన్యాసాలు చూస్తుంటే తనకూ పైలట్ కావాలన్న కోరిక కలుగుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజ్‌ని ఇన్నాళ్లు సక్రమంగా ఉపయోగించలేదని... ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయని తెలిపారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire