Top
logo

కేసీఆర్‌తో అఖిలేష్‌ భేటీ, ప్రగతిభవన్‌లో విందు

కేసీఆర్‌తో అఖిలేష్‌ భేటీ, ప్రగతిభవన్‌లో విందు
X
Highlights

దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యమని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌తో యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ భేటీ...

దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యమని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌తో యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ భేటీ అయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రగతిభవన్‌కు చేరుకున్న అఖిలేశ్‌కు కేసీఆర్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇతర నేతలు పాల్గొన్నారు. భోజనం అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించారు.

అంతకుముందు లఖ్‌నవూ నుంచి బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న అఖిలేశ్‌కు.. మంత్రులు కేటీఆర్, తలసాని ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.

గుణాత్మక మార్పు అవసరమని పేర్కొన్న కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌తో కేసీఆర్‌ చర్చలు జరిపారు.

Next Story