టీకాంగ్రెస్ లో కొత్త నియామకాలు.. రేవంత్‌ రెడ్డికి కీలక పదవి..

టీకాంగ్రెస్ లో కొత్త నియామకాలు.. రేవంత్‌ రెడ్డికి కీలక పదవి..
x
Highlights

తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ కొత్త నియామకం చేపట్టింది. అలాగే పీసీసీ కమిటీలతో పాటుగా మరో తొమ్మిది అనుబంధ కమిటీలకు నియామకాలు చేసింది ఏఐసీసీ. పీసీసీ వర్కింగ్...

తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ కొత్త నియామకం చేపట్టింది. అలాగే పీసీసీ కమిటీలతో పాటుగా మరో తొమ్మిది అనుబంధ కమిటీలకు నియామకాలు చేసింది ఏఐసీసీ. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు నియమితులయ్యారు. సినీ నటి విజయశాంతిని తెలంగాణ ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్‌, తెలంగాణ ప్రదేశ్‌ ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు వంటి పదవుల్లో నియమించారు. అలాగే పబ్లిసిటీ కమిటీకి చైర్మన్‌గా కోమటిరెడ్డి వెంకట రెడ్డి నియమితులయ్యారు. కో- చైర్‌పర్సన్‌గా సౌదాగర్‌ గంగారాం, సభ్యులుగా దాసోజు శ్రవణ్‌, కూన శ్రీశైలం గౌడ్‌ నియమితులయ్యారు. ఇక క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్క నియమితులు కాగా.. కో- చైర్‌పర్సన్‌గా డీకే అరుణ, కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్ వ్యవహరించనున్నారు. అంతేకాకుండా మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కో- చైర్‌పర్సన్‌ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కన్వీనర్‌ గా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ లను ఏఐసీసీ నియమించింది. ఇక స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ చైర్మన్‌ గా మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎల్డీఎంఆర్సీ కమిటీ చైర్మన్‌ గా ఆరెపల్లి మోహన్, ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌ గామర్రి శశిధర్ రెడ్డి, డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్‌ గా ఎం. కోదండరెడ్డి లను ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ నియమించింది. ఈ మేరకు పత్రికా ప్రకటనలో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories