logo
సినిమా

5 ఏళ్ల త‌రువాత‌..

5 ఏళ్ల త‌రువాత‌..
X
Highlights

షారుఖ్ ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, అనుష్మ శ‌ర్మ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'జ‌బ్ త‌క్ హై జాన్‌'. ఐదేళ్ల క్రితం...

షారుఖ్ ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, అనుష్మ శ‌ర్మ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'జ‌బ్ త‌క్ హై జాన్‌'. ఐదేళ్ల క్రితం విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు య‌శ్ చోప్రా రూపొందించిన చివ‌రి చిత్రం ఇది. మ‌ళ్లీ షారుఖ్‌, క‌త్రినా, అనుష్క కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతోంది. 'త‌ను వెడ్స్ మ‌ను', 'త‌ను వెడ్స్ మ‌ను రిట‌ర్న్స్' వంటి హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

ఇది షారుఖ్‌తో క‌త్రినా న‌టిస్తున్న రెండో చిత్రం కాగా.. అనుష్క న‌టిస్తున్న నాలుగో చిత్రం. ఇందులో షారుఖ్ మ‌రుగుజ్జు పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. అనుష్క కూడా క్లిష్ట‌మైన పాత్ర‌ని పోషిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంకా పేరు నిర్ణ‌యించ‌ని ఈ చిత్రం వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది.

Next Story