Top
logo

గ్రామంలోకి వస్తే చంపేస్తాం.. అడవిలో తలదాచుకుంటున్న ప్రేమజంట

గ్రామంలోకి వస్తే చంపేస్తాం.. అడవిలో తలదాచుకుంటున్న ప్రేమజంట
X
Highlights

ఇటీవల ప్రేమికులపై తీవ్రమైన దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న కారణంగా...

ఇటీవల ప్రేమికులపై తీవ్రమైన దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న కారణంగా యువకుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు మారుతీరావు అనే వ్యాపారి. ఈ ఉదంతం మరవకముందే.. హైదరాబాద్ లో కన్నతండ్రే కూతురిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.. తాజాగా జనగామ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటను గ్రామంలోని పెద్ద మనుషులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ ఘటన గుండాల మండలం మరిపడగ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే ఊరిలోకి వస్తే చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. గ్రామంలోకి రావొద్దని.. వస్తే చంపేస్తామనడంతో దిక్కుతోచని స్థితిలో ఆ జంట అడవిలో తలదాచుకుంది.

Next Story