ఆదివాసీ దెబ్బ... లంబాడీ అబ్బా.. ఆదిలాబాద్‌లో ఆసక్తికరమైన రాజకీయం

ఆదివాసీ దెబ్బ... లంబాడీ అబ్బా.. ఆదిలాబాద్‌లో ఆసక్తికరమైన రాజకీయం
x
Highlights

ఆదిలాబాద్‌ జిల్లాలో లంబాడా వర్సెస్‌ ఆదివాసీల పోరు ఎన్నికల రణక్షేత్రంగా మారింది. ముఖ్యంగా ఖానాపూర్ ‌నియోజకవర్గంలో ఆదివాసీల ఆందోళన ప్రధాన పార్టీలకు...

ఆదిలాబాద్‌ జిల్లాలో లంబాడా వర్సెస్‌ ఆదివాసీల పోరు ఎన్నికల రణక్షేత్రంగా మారింది. ముఖ్యంగా ఖానాపూర్ ‌నియోజకవర్గంలో ఆదివాసీల ఆందోళన ప్రధాన పార్టీలకు దడపుట్టిస్త్తోంది. తమ ప్రాబల్యముండే ఖానాపూర్‌లో, లంబాడా అభ్యర్థులను ఎలా నిలబెడతారని ఆదివాసీ సంఘాలు నిలదీస్తున్నాయి. ఆదివాసీల తరపున స్వతంత్ర అభ్యర్థిని రంగంలోకి దించి సత్తా చాటుతామని సవాల్‌ విసురుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానపార్టీలకు ఆదివాసీల ఉద్యమం గుబులు పుట్టిస్తోంది. ఖానాపూర్ నియోజకవర్గంలో తమ ఆత్మగౌరవాన్ని పార్టీలు దెబ్బతీస్తున్నాయని ఆరోపిస్తున్న ఆదివాసీ సంఘాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలో ఆదివాసీల ఓట్లు 63 వేలు. మెజారిటీ ఓట్లు వీరివే. కానీ అత్యధికంగా ఓట్లు ఉన్న వర్గాలను కాదని, సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ టికెట్ కేటాయించింది టిఆర్‌ఎస్. అదే విధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపి రమేష్ రాథోడ్ దాదాపు ఖారారయ్యారు. ఇలా రెండు ప్రధాన పార్టీలు,అత్యధిక ఓట్లున్న తమ సామాజిక వర్గాలను కాదని లంబాడాలకు సీట్లు కేటాయించడంపై ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి.

పార్టీల తీరును నిరసిస్తూ ఆదివాసీ సంఘాలు, ఆత్మగౌరవ నినాదంతో పోరాటానికి సై అంటున్నాయి. అందులో భాగంగా ఖానాపూర్‌లో ఆదివాసీల అభ్యర్థిని నిలబెట్టాలని తీర్మానించాయి. అన్ని సంఘాల ఏకాభిప్రాయంతో లంబాడాల ఓటమే లక్ష్యంగా ఎన్నికల సంగ్రామంలో దిగడానికి ఆదివాసీలు వ్యూహరచన చేస్తున్నారు. లంబాడా అభ్యర్థుల వెంట ప్రచారానికి వెళ్లవద్దని, వాళ్లకు మద్దతు ఇవ్వవద్దని, ఉట్నూర్‌లో తీర్మానించాయి. ఒకవేళ ఎవరైనా ఆదివాసీ సంఘాల నాయకులు,ప్రజలు వెళితే వాళ్లను కుల బహిష్కరణ చేస్తామని హెచ్చారించాయి ఆదివాసీ సంఘాలు. ఆదివాసీ సంఘాలు, ఖానాపూర్‌ను టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి పోటి చేస్తున్న ఇద్దరూ లంబాడా అభ్యర్థులే. మాజీ ఎంపి రమేష్ రాథోడ్, రేఖానాయక్ ఇద్దరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆదివాసీలు ఈ ఎన్నికలే సరియైనవిగా భావిస్తున్నారు.

ఇదే ఖానాపూర్ నియోజకవర్గంలో 1989లో ఆదివాసీ నాయకుడు మాజీమంత్రి కోట్నాక భీమ్ విజయం సాధించారు. ఆ తర్వాత మళ్లీ ఆదివాసీలకు అవకాశాలు రాలేదు. ఓట్లు అత్యధికంగా ఉన్నా, తమకు సీట్లు రాకపోవడానికి లంబాడాలే కారణమని రగిలిపోతున్నారు ఆదివాసీలు. ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అక్రమంగా అనుభవిస్తున్నారని, లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమించారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉంటేనే, ఈ డిమాండ్‌ నెరవేర్చుకోవడానికి, గళం వినిపించడానికి ఆస్కారముంటుందని భావిస్తున్నారు. మొత్తానికి ఖానాపూర్‌లో ఆదివాసీ వర్సెస్‌ లంబాడా ఉద్యమం, ఎన్నికల రణక్షేత్రంగా మారబోతోంది. ప్రధాన పార్టీలు తమను పక్కనపెట్టాయని రగిలిపోతున్న ఆదివాసీలు, ఎన్నికల బరిలో తమ సత్తా ఏంటో, ఐక్యత ఏంటో చూపిస్తామని శపథం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories