తారాజువ్వపై లక్ష్మీబాంబ్‌... ఆదిలాబాద్‌లో రాజకీయ హైడ్రామాలు

తారాజువ్వపై లక్ష్మీబాంబ్‌... ఆదిలాబాద్‌లో రాజకీయ హైడ్రామాలు
x
Highlights

పాతబస్తీలో సీమ టపాకాయిలా పేలి, చిచ్చుబుడ్డిలా చెలరేగిపోయి, భూచక్రంలా గిరగిరా తిరిగి, ఎంఐఎం నేలను షేక్‌ చేసే ఫుల్లీ లోడెడ్‌ క్రాకర్‌ ప్యాక్‌లా, బాంబు...

పాతబస్తీలో సీమ టపాకాయిలా పేలి, చిచ్చుబుడ్డిలా చెలరేగిపోయి, భూచక్రంలా గిరగిరా తిరిగి, ఎంఐఎం నేలను షేక్‌ చేసే ఫుల్లీ లోడెడ్‌ క్రాకర్‌ ప్యాక్‌లా, బాంబు విసురుతోంది కమలదళం. ఇప్పటికీ వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అక్బరుద్దీన్. చాంద్రాయణగుట్టలో ఓటమి ఎరుగని వ్యక్తిగా దూసుకువెళుతున్నారు. అలాంటి నాయకుడిని ఓడించడాలని టార్గెట్ చేసింది బీజేపీ. అదే వర్గం నుంచి ఒకరిని ఆయుధంలా విసరాలని కంకణం కట్టుకుంది. సంచలనమయ్యేలా, ఆ అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంది...అందుకు ఓ మహిళా బాంబుకు సానపెడుతోంది. ఆ అస్త్రమే సయ్యద్ షెహజాదీ.

సయ్యద్ షెహజాది. ఓ సాదాసీదా ముస్లిం కుటుంబంలో పుట్టిన మహిళ. అడవులు ఖిల్లా ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగారు. కాషాయం పట్ల ఎందుకనో ఆకర్షితులయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్టూడెంట్ లీడర్‌గా చేరారు. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యూయేట్ చదివేటప్పుడు ఏబీవీపీలో చేరారు. ప్రస్తుతం ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. ఎంఐఎంకు కంచుకోటలాంటి పాతబస్తీలో, అదే పార్టీకి వ్యతిరేకంగా గళమెత్తుతూ, గల్లీగల్లీ తిరుగుతున్నారు షెహజాది. ఓల్డ్‌సిటీలో ముస్లిం మహిళల సమస్యలు - స్థితిగతులపై అవగాహన కల్పిస్తున్నారు షెహజాది. హక్కుల పట్ల చైతన్యం రేకెత్తిస్తున్నారు. చదువుకుంటేనే, భవిష్యత్తని చెబుతున్నారు. బోనాలు - గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఓవైసీ కుటుంబాన్ని టార్గెట్ చేసి పాతబస్తీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎంఐఎంను వ్యతిరేకిస్తున్న ముస్లిం బస్తీల్లోకి షెహజాదీ వెళ్లి ప్రజల మనసులను దోచుకున్నారు. ఎంఐఎం కోటను బద్దలుకొట్టేందుకు, ధైర్యంగా అడుగులేస్తున్నారు.

దేశంలో ముస్లింలకు ఏకైక ప్రతినిధిగా ఎంఐఎం తనకు తాను చెప్పుకుంటోందని విమర్శిస్తున్నారు షెహజాది. కేవలం ఒక కుటుంబమే ముస్లిం సమాజానికి దిక్కన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. పాతబస్తీలో ముస్లింల అభివృద్దికి ఏమాత్రం పాటుపడకుండా, మాయమాటలతో వారిని మోసం చేస్తున్నారని, అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లపై మండిపడ్దారు. మహిళాభివృద్దికి ఎంఐఎం పూర్తి వ్యతిరేకమని, అందుకే బీజేపీ తరపున పోటీ చేసి, ఎంఐఎం అహంకారాన్ని అణచివేస్తానంటున్నారు షెహజాది. బీజేపీపై ఎంఐఎం మతతత్వ ముద్ర వేస్తోందని విమర్శించారు షెహజాది. యూపీలో ముస్లింల అభివృద్దికి బీజేపీ, ఎంతో తోడ్పాటు అందిస్తోందని అన్నారు.

అక్బరుద్దీన్‌పై పదునైన వాగ్భాణాలు సంధిస్తూ, సయ్యద్ షెహజాది ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోముస్లిం ఓటర్లను తనవైపు తిప్పుకునేలా, బిజెపి చేపట్టిన సంక్షే పథకాలు ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. దాంతో ముస్లిం ఓటర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని అంటున్నారామె. ఆదిలాబాద్ జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన, ఎంతో పోరాటపటిమ కలిగిన తన సోదరికి అక్బరుద్దీన్‌పై పోటి చేయడానికి, బిజెపి టికెట్ కేటాయించడంపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అక్బరుద్దీన్‌పై వ్యూహాత్మకంగా సయ్యద్ షెహజాదిని ప్రయోగించింది బీజేపీ. ముస్లిం వ్యతిరేకిగా ముద్రపడిన తమ పార్టీపై, ఆ ముద్ర చెరిగిపోయేందుకు, ముస్లిం వర్గానికే చెందిన షెహజాదిని బరిలోకి నిలుపుతున్నారు. దీనికితోడు ముస్లింల ఓటు బ్యాంకు తమదే అన్నట్టుగా వ్యవహరించే, ఎంఐఎంపై, అదే వర్గానికి చెందిన మహిళా నాయకురాలిని నిలబెట్టి, చర్చనీయాంశం చేసింది. పాతబస్తీలో మరోసారి కమలం వర్సెస్‌ కైట్‌‌గా ఫైట్‌ మార్చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories