ఆధార్‌పై క్లారిటీ.. కానీ షరతులు వర్తిస్తాయి!!

ఆధార్‌పై క్లారిటీ.. కానీ షరతులు వర్తిస్తాయి!!
x
Highlights

అనుమానాలు తొలగిపోయాయ్. ఆధార్‌ అంశంపై క్లారిటీ వచ్చింది. ఆధార్ ఎక్కడ అవసరం లేదో..ఎక్కడ తప్పనిసరో సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఆధార్‌ను సమర్థిస్తూనే...

అనుమానాలు తొలగిపోయాయ్. ఆధార్‌ అంశంపై క్లారిటీ వచ్చింది. ఆధార్ ఎక్కడ అవసరం లేదో..ఎక్కడ తప్పనిసరో సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఆధార్‌ను సమర్థిస్తూనే కొన్ని షరతులు పెట్టింది. అత్యున్నత న్యాయస్థానం. ఆధార్ కార్డు చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని దాఖలైన 31 పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం..సంచలన తీర్పు ఇచ్చింది. ఆధార్‌కు చట్టబద్ధత ఉందని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది. ఐదురుగు సభ్యుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు ఆధార్‌ ఫార్ములాను సమర్ధించారు. ప్రజలకు ఒక విశిష్టమైన గుర్తింపు ఉండడం మేలని అభిప్రాయపడ్డారు. ఇతర ఐడీ కార్డుల కన్నా.. ఆధార్ భిన్నమైన గుర్తింపు కార్డు అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆధార్‌ను నకిలీ చేయలేరని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

అయితే ఆధార్‌కు చట్టబద్ధత ఉందంటూనే ప్రైవేట్‌ కంపెనీలు ఆధార్‌ డేటాను కోరడానికి అనుమతించే సెక్షన్‌ 57ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ నంబర్‌లు తీసుకునేందుకు ఆధార్ కోసం బలవంతం చేయరాదని...అలాగే స్కూళ్ల అడ్మిషన్లకు ఆధార్ అవసరం లేదని స్సష్టం చేపింది. ఇక సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీ పరీక్షలకు హాజరవ్వడానికి కూడా ఆధార్‌ తప్పనిసరి కాదని కోర్టు తేల్చి చెప్పింది. కానీ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి, పాన్‌ కార్డు నమోదు చేసుకోవడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరని కోర్టు స్పష్టత ఇచ్చింది. అలాగే ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ అవసనమని తెలిపింది. అక్రమంగా వలస వచ్చిన వారికి ఆధార్ కార్డు మంజూరు చేయరాదని సూచించారు.

ఆధార్ తీర్పును చదివి వినిపించిన జస్టిస్ ఏకే సిక్రీ... ఆధార్‌ నమోదుకు ప్రజల నుంచి సాధ్యమైనంత కనీస సమాచారం మాత్రమే తీసుకున్నారని అన్నారు. ప్రజాప్రయోజనాల కోసమే ఆధార్‌ సేవలను తీసుకొచ్చారని, సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆధార్‌ ఒక గుర్తింపని చెప్పారు. ఆధార్ డేటా భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాదు..కోర్టు అనుమతి లేకుండా బయోమెట్రిక్‌ సమాచారాన్ని ఏ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆధార్‌ తీర్పు బీజేపీకి చెంపపెట్టని కాంగ్రెస్ విమర్శించింది. ఆధార్ ను తెచ్చిన ఘనత కాంగ్రెస్ ది అయితే ...బీజేపీ సవాలక్ష నిబంధనలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వీ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఆధార్ తీర్పును స్వాగతించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories