logo
సినిమా

వాళ్ళు ఆడవాల్ల ఆత్మను చంపీ.. శవాల మీద చిల్లరేరుకునే ముఖాలు : నటి మాధవీలత

వాళ్ళు ఆడవాల్ల ఆత్మను చంపీ.. శవాల మీద చిల్లరేరుకునే ముఖాలు : నటి మాధవీలత
X
Highlights

గతకొంతకాలం కిందట టాలీవుడ్ ను కుదిపేసిన కాస్టింగ్ కౌచ్ మరవకముందే అమెరికాలో సెక్స్ రాకెట్ నడుపుతూ ఇద్దరు తెలుగు ...

గతకొంతకాలం కిందట టాలీవుడ్ ను కుదిపేసిన కాస్టింగ్ కౌచ్ మరవకముందే అమెరికాలో సెక్స్ రాకెట్ నడుపుతూ ఇద్దరు తెలుగు దంపతులు, వారితోపాటు కొందరు వర్ధమాన నటీమణులను పట్టుబడ్డారు. అయితే విచారణలో కొందరు టాలీవుడ్ హీరోయిన్లను సంప్రదించినట్టు వారు అంగీకరించారు. ఈ విషయంపై ఇప్పటికే నటి శ్రీరెడ్డి, యాంకర్ అనసూయలు స్పందించారు. తాజాగా సెక్స్ రాకెట్ ముఠాలో హీరోయిన్ మాధవీలత ఉన్నట్టు సోషల్ మీడియాలో రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ రూమర్లపై మాధవీలత తన పేస్ బుక్ పేజీ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

'ఇది కేవలం సంస్కారం లేని వాళ్ళకి మాత్రమే.. వినేవన్నీ నిజాలు కావు.. బయటకి వచ్చేవి అన్నీ న్యాయం కాదు.. ఎముకలు కుళ్లిన.. వయస్సు మళ్ళిన సోమరులు మీరు.. చావండీ.. ఆడవాల్ల ఆత్మను చంపీ.. శవాల మీద చిల్లరేరుకునే ముఖాలూ.. మనసే లేని మృగాలు.. మలినమైన అంతరాత్మలు మీరు.

ఫేస్ బుక్‌లోనూ, యూట్యూబ్‌లోనూ తెగ బలిసిన కుక్కల వాగుడుకి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి వాడి చుట్టూ తిరిగి నేను మంచిదాన్ని అని సర్టిఫికేట్ తెచ్చుకోను. అక్కర్లేదు... అన్నిచోట్లా అన్నీ ఉంటాయి. వేటిని ఆపడం సాధ్యం కాదు. తెలిసిన మన పని మనం చేసుకుని బురదలో నేనెందుకు పడటం అని జాగ్రత్తగా వెళిపోవడం తప్ప. ఆపడానికి నేను సీఎం కాదు పీఎం కాదు జస్ట్ ఏ కామన్‌ గర్ల్‌... ఇప్పుడు నా ఫేస్‌బుక్‌లో నన్ను బూతులు తిడుతున్న చెత్త నా డాష్ గాళ్లకి సమాధానం చెప్పే అవసరం నాకు లేదు.

నువ్ వచ్చావా???
నువ్ చూశావా?????
నువ్ ఉన్నావా????

ఈ ప్రశ్నలకు దమ్ముంటే ఆన్సర్ ఇవ్వండి. సో కథలు విని అదే నిజం అనుకుంటే నేను కథలు చాలా చెప్తాను... చదువుకున్నారు.. నా బతుకు ఏంటి. నా అవసరం ఏంటి. నా జాబ్ ఏంటి. నా ఫ్యామిలీ ఏంటి. అని చూసుకుంటే మన దేశం ఇలా సంకనాకి పోదేమో పాపం...

నన్ను కామెంట్స్ ఎవరెవరు అయితే చేస్తున్నారో చేయండి పర్వాలేదు. ఎవడికి నేను ఆన్సర్ చెప్పను నాకు అవసరం లేదు... నా నిజాయితీ ఇది అని ప్రూవ్ చేసుకునే కర్మ నాకు పట్టలేదు. అలా పడితే ఇంక నా లైఫ్ ఎండ్... కావునా ఇలాంటి గాసిప్స్‌ని నేను పట్టించుకుకోను. చెడ్డ పేరు గురించి పట్టించుకోను. ఎందుకంటే నాకు తెలుసు నేను ఏంటో అని. కేవలం నా జీవీతం గురించి జాగ్రత్త తీసుకుంటాను. నేను ఓ పొలిటికల్ పార్టీలో ఉన్నాను.. కాని మీకు ఎలాంటి ప్రమాణాలు చేయలేదు. కాబట్టి నన్ను ప్రశ్నించడానికి మీకు ఎలాంటి అధికారం, హక్కు లేదు. నా బాధ్యతగా ఏం చేయాలో అది చేస్తున్నా.. నేను ఈ దేశంలోనే బెస్ట్ సిటిజన్‌గా కాగలననే నమ్మకం ఉంది. నేను ప్రమాణం చేసిన రోజున అడగండి. ఇప్పటికి మీ ఎమ్మెల్యేని అడుక్కోండి ఏం పీకావురా మా ఏరియాకి అని, అప్పుడు బాగుపడుతుంది దేశం' అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

Next Story