షూటింగ్‌కెళ్లి తిరిగొస్తుండగా బెంగాలీ నటికి చేదు అనుభవం

కోల్‌కతా: బెంగాలీ నటి కాంచన మొయిత్రాకి చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్‌కెళ్లి తిరిగొస్తుండగా ఆమెపై కొందరు...
కోల్‌కతా: బెంగాలీ నటి కాంచన మొయిత్రాకి చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్‌కెళ్లి తిరిగొస్తుండగా ఆమెపై కొందరు తాగుబోతులు వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను వేధించిన వ్యక్తులిద్దరూ 20 ఏళ్ల లోపు యువకులు కావడం గమనార్హం. తన కారులో టోలీగంజ్‌లోని షూటింగ్ స్పాట్ నుంచి రాత్రి సమయంలో ఇంటికి వెళుతుండగా.. ఎవరో కారుపై రాళ్లు విసిరినట్లుగా అనిపించిందని ఆమె తెలిపింది. వెంటనే కారు డ్రైవర్ ఏం జరిగిందా అని దిగి చూస్తుండగానే.. ఇద్దరు యువకులు మద్యం మత్తులో తమ దగ్గరికొచ్చారని కాంచన చెప్పింది. తాను కారులోనే ఉన్నానని, డ్రైవర్‌తో వాళ్లు గొడవ పడుతుంటే ఎవరో చూద్దామని కారు దిగానని వివరించింది. ఇంతలోనే మరో యువకుడు వారితో కలిసి తమతో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది.
కారు కీస్ బలవంతంగా లాగేసి నానా హంగామా చేశారని.. తనను 40 సార్లు గుంజీలు తీయమని బెదిరించారని కాంచన చెప్పింది. భయంతో తాను పోలీసులకు ఫోన్ చేశానని చెప్పింది. ఆ ముగ్గురు కలిసి తన కారు డ్రైవర్‌పై దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన డ్రైవర్ తప్పుంటే క్షమించాలని కోరినా వదల్లేదని ఆమె తెలిపింది. ఇదేంటని అడిగినందుకు భుజంపై చెయ్యేసి అసభ్యంగా ప్రవర్తించారని కాంచన చెప్పింది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు స్పందిస్తూ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఇద్దరు యువకులను పెట్రోలింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, మరో యువకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సొంత నగరంలోనే తనకిలాంటి భయానక సందర్భం ఎదురుకావడం పట్ల కాంచన మొయిత్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT