Top
logo

దినకరన్ గెలుపుతో సంచలన ప్రకటన చేసిన విశాల్

దినకరన్ గెలుపుతో సంచలన ప్రకటన చేసిన విశాల్
X
Highlights

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తలపడి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించి విఫలమైన దక్షిణాది హీరో విశాల్, ఇప్పుడు ...

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తలపడి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించి విఫలమైన దక్షిణాది హీరో విశాల్, ఇప్పుడు సంచలన ప్రకటన చేశాడు. ఆర్‌కే నగర్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకుడు దినకరన్‌కు తాను అండగా ఉంటానని నటుడు విశాల్‌ పేర్కొన్నారు. ఆ నియోజకవర్గం ప్రజల ప్రధాన సమస్యల పరిష్కారంలో తాను ఆయనకు అన్ని విధాలా సహకరిస్తాననిని తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనను జారీ చేస్తూ కుక్కర్‌ చిహ్నంపై గెలిచిన దినకరన్‌ ఆ నియోజకవర్గంలోని మహిళలంతా కుక్కర్‌తో హాయిగా వంట చేసుకునే పరిస్థితులు తెప్పించేందుకు పాటుపడాలన్నారు. నీటి సదుపాయాన్ని దగ్గర చేయాలని సూచించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను ఉంచాడు. విజయం సాధించిన దినకరన్ కు తన హృదయ పూర్వక అభినందనలని చెప్పాడు.

Next Story