logo
సినిమా

అభిమానులపై మండిపడ్డ హీరో సూర్య

అభిమానులపై మండిపడ్డ హీరో సూర్య
X
Highlights

ప్రముఖ నటుడు సూర్య తన అభిమానులపై మండిపడ్డారు. మరొకసారి అలా చేయకండంటూ హెచ్చరించారు. అయితే అభిమానులపై ప్రేమతోనే...

ప్రముఖ నటుడు సూర్య తన అభిమానులపై మండిపడ్డారు. మరొకసారి అలా చేయకండంటూ హెచ్చరించారు. అయితే అభిమానులపై ప్రేమతోనే ఇదంతా చేశాడు. సూర్య నటించిన తమిళ సినిమా ‘గ్యాంగ్’ సక్సెస్ మీట్ లో భాగంగా చెన్నైలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు. ఇందులో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో సూర్య సందడి చేశాడు. ఈ సందర్భంగా సూర్య అభిమానులు బైక్ లపై హెల్మెట్లు లేకుండా ర్యాలీ నిర్వహించారు. ఇది గమనించిన సూర్య తన కారులో నుంచి కిందకు దిగి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్మెట్లు ధరించకుండా బైక్ లపై దూసుకెళుతున్నారని, ఆ బైక్ లలో ఒకటి అదుపు తప్పి తన కారు కింద పడబోయిందని, పొరపాటున వారికేమన్నా జరిగితే ఆ సంఘటన తనను జీవితాంతం వెంటాడుతుందని ఉద్వేగభరితంగా చెప్పాడు.

Next Story