logo
సినిమా

తమన్నాతో ఘనంగా నటుడు సౌందర్ రాజా వివాహం..!

తమన్నాతో ఘనంగా నటుడు సౌందర్ రాజా వివాహం..!
X
Highlights

ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీల వివాహాలు బయటి ప్రపంచానికి తెలియకుండానే జరిగిపోతున్నాయి. మొన్నటికిమొన్న...

ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీల వివాహాలు బయటి ప్రపంచానికి తెలియకుండానే జరిగిపోతున్నాయి. మొన్నటికిమొన్న హీరోయిన్ శ్రీయాశరన్ వివాహం తన బాయ్ ఫ్రెండ్ తో సైలెంట్ గా జరిగిన సంగతి మరవకముందే ఎటువంటి ఆర్బాటం లేకుండా పెళ్లి చేసుకున్నాడు కోలీవుడ్ నటుడు సౌందర్ రాజా.. వ్యాపారవేత్త తమన్నా మెడలో మూడుముళ్ళు వేశాడు. శుక్రవారం జరిగిన ఈ వివాహానికి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా తమన్నా గ్రీన్‌ యాపిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈఓ గా ఉన్నారు. గతకొన్ని రోజులుగా పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట శుక్రవారం ఒక్కటైంది. ఇదిలావుంటే విలక్షణ నటుడిగా పేరున్న సౌందర్ రాజా సుందరపాండియన్‌, జిగర్‌తాండా, ఎనక్కు వేరు ఎంగుమ్‌ కిలైగళ్‌ కడియాదు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు.

Next Story