logo
సినిమా

ఆమె నోరు విప్పితే.. డ్రైనేజే : నటి శ్రీరెడ్డి

ఆమె నోరు విప్పితే.. డ్రైనేజే : నటి శ్రీరెడ్డి
X
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రెండో వివాహంపై సోషల్ మీడియాలో కొందరు పవన్ అభిమానులు ఆగ్రహం ...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రెండో వివాహంపై సోషల్ మీడియాలో కొందరు పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారి పవన్ అభిమానుల విమర్శలను ఎప్పటికప్పుడు రేణూదేశాయ్ తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో 'నేను నోరు విప్పితే పవన్ అభిమానులు బాధపడతారు' అని ఘాటుగా హెచ్చరించారు. అయినా కూడా పవన్ అభిమానులు రేణూపై కామెంట్లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో ఆమె సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా రేణూదేశాయ్ కి బాసటగా నిలిచారు నటి శ్రీరెడ్డి. ఒక స్త్రీ గా రేణూ దేశాయ్ కి సపోర్ట్ చేస్తానని ఆమె తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా 'ఆమె నోరు తెరిస్తే మాజీ భర్త పాపులారిటీ డ్రైనేజే'నని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

Next Story