అమెరికా పర్యటనపై క్లారిటీ.. అందుకే వెళ్ళా : శివాజీ

అమెరికా పర్యటనపై క్లారిటీ.. అందుకే వెళ్ళా : శివాజీ
x
Highlights

గతకొద్ది రోజులుగా ఆపరేషన్ గరుడ అంటూ రాజకీయాల్లో అలజడి సృష్టించిన నటుడు శివాజీ.. ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ పై విశాఖలో...

గతకొద్ది రోజులుగా ఆపరేషన్ గరుడ అంటూ రాజకీయాల్లో అలజడి సృష్టించిన నటుడు శివాజీ.. ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ పై విశాఖలో జరిగిన హత్యాయత్నం.. ఆపరేషన్ గరుడాలో భాగమేనని వెల్లడించాడు శివాజీ. అయితే శివాజీ వ్యాఖ్యలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. ఆయనేమైనా జోతిష్కుడా.. ఏమి జరుగుతుందో ముందే చెప్పడానికి అంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా అతనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలపై శివాజీ స్పందించారు. తన చివరి శ్వాస దాకా.. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం తాను పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఢిల్లీ రాక్షసుల భరతం పడతానంటూ హెచ్చరించారు. టీడీపీ అండతో శివాజీ అమెరికా పారిపోయాడన్న వైసీపీ వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. వ్యక్తిగత పనుల కోసమే విదేశాలకు వెళ్లినట్లు తెలిపాడు. అలాగే తన ప్రాణాలకు ముప్పుందంటూ వైసీపీ నేత లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.. తాను చావుకు భయపడేంత పిరికివాడిని కాదని స్పష్టం చేశారు. లక్ష్మీపార్వతి తనపై జాలి చూపాల్సిన అవసరంలేదని.. ఆమెను చూస్తేనే జాలేస్తోందన్నారు. నవంబర్‌ పదో తేదీన భారత్‌కు తిరిగి వస్తున్నానని… తనను ఎవరు ఏమి చేస్తారో చేసుకోండి.. గుంటూరు కారం రుచి చూపిస్తా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు శివాజీ.

Show Full Article
Print Article
Next Story
More Stories