Top
logo

నేను ఎంతో కాలం బ్రతకను : నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

నేను ఎంతో కాలం బ్రతకను : నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు
X
Highlights

బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా తాను ఎంతో కాలం బతకనంటూ.. ఈ విషయం తన మెదడు తనకు...

బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా తాను ఎంతో కాలం బతకనంటూ.. ఈ విషయం తన మెదడు తనకు నిత్యం గుర్తుచేస్తూనే ఉంటోందని వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా న్యూరో ఎండోక్రిన్‌ ట్యూమర్‌ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం లండన్‌లోని ప్రముఖ క్యాన్సర్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. కొంత కాలంగా అయన ఆరోగ్యంపై పలు రకాల రూమర్లు పుట్టుకొస్తున్న సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్‌ఖాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు సోకిన కేన్సర్‌కు ఆరు దశల్లో కీమోథెరఫీ చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం నాలుగు దశలు పూర్తయ్యాయని వివరించారు. మిగతా రెండు దశలు పూర్తయ్యాక తాను జీవించగలనన్న నమ్మకం లేదని చెప్పాడు . దాంతో అయన అభిమానులు నిర్ఘాంతపోతున్నారు.

Next Story