logo
తాజా వార్తలు

యువతుల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఈ మహిళ చేస్తున్న పని చూస్తే..

యువతుల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఈ మహిళ చేస్తున్న పని చూస్తే..
X
Highlights

సాటి మహిళ అన్న ఇంగితం కూడా లేకుండా ఓ మహిళ వారి పరువు బజారుకీడ్చేలాగా వ్యవహరించింది. ఇంటర్‌నెట్‌ మాధ్యమంగా...

సాటి మహిళ అన్న ఇంగితం కూడా లేకుండా ఓ మహిళ వారి పరువు బజారుకీడ్చేలాగా వ్యవహరించింది. ఇంటర్‌నెట్‌ మాధ్యమంగా చేసుకుని ఆన్‌లైన్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నారు మహిళా, ఆమె మేనల్లుడు. గుంటూరుకు చెందిన రాజేశ్వరి, తన మేనల్లుడుతో సామజిక మాధ్యమం ఫేస్ బుక్ లో యువతుల ఫొటోలతో ఫేక్ ఖాతాలు తెరిచి, వాటి ద్వారా అబ్బాయిలకు ఎరవేసి వాళ్లను ఛీట్ చేస్తున్నారు. ఇప్పటికి 5 అకౌంట్ల ద్వారా చాలా మందిని మోసం చేసింది. వారినుంచి దాదాపు 20 లక్షల వరకూ వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల ఫొటోను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారని ఓ యువతి గ్రహించింది. దీంతో వీరి గుట్టు వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌ వ్యభిచారానికి తాను అంగీకరిస్తున్నట్లు తెలుపుతూ కొందరు తన ఫొటోలు అప్‌లోడ్‌ చేసి వ్యాపారం చేస్తున్నారని విజయవాడకు చెందిన ఆ యువతీ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువతుల జీవితాలతో చెలగాటం ఆడటంతో పాటు డబ్బులు వసూళ్లు చేస్తూ మోసాలకు పాల్పడుతోన్న అత్త రాజేశ్వరితో పాటు ఆమె అల్లుడు సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story