పరువు హత్య...సంచలన విషయాలు

పరువు హత్య...సంచలన విషయాలు
x
Highlights

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకేసు నిందితులను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూతురి ప్రేమ పెళ్లి...

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకేసు నిందితులను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూతురి ప్రేమ పెళ్లి ఇష్టం లేక ప్రణయ్ ను మారుతిరావే హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. నిందితులు మారుతీరావు, తిరునగరు శ్రవణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కత్తితో హత్య చేసిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

హత్యకు ముందు ప్రణయ్ ఇంటి ముందు హంతకుడు స్కూటిపై రెక్కి నిర్వహించినట్లుగా గుర్తించారు పోలీసులు. హంతకుడు రెక్కి నిర్వహించిన తర్వాతే ప్రణయ్ తల్లి భార్యతో కలిసి హస్పిటల్ కు వెళ్లారు. అమృత తండ్రి మారుతీ రావు ఎప్పటికప్పుడు హంతకుడికి ఫోన్ లో సమాచారం అందించినట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు ప్రణయ్‌ ఇంటి ముందున్న సీసీ కెమెరాలోని దృశ్యాలను పోలీసులు పరిశీలించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. హంతకుడు గత నెల 22న కూడా ప్రణయ్ కారును ఫాలో అయినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. దుండగుడు బైకుపై ప్రణయ్‌ కారును అనుసరించినట్టు స్పష్టంగా కనబడింది. ఇతడే జ్యోతి ఆస్పత్రి వద్ద ప్రణయ్‌ను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories