వైసీపీకి షాక్.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు!

వైసీపీకి షాక్.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు!
x
Highlights

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీకి షాక్ తగిలింది.. ఆ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి బినామీ ఆరోపణల నేపథ్యంలో అవినీతి...

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీకి షాక్ తగిలింది.. ఆ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి బినామీ ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నోటీసులు అందించింది. ఈ నెల 22న తమ ఎదుట హజరు కావాలని ఆదేశించారు ఏసీబీ అధికారులు. అంతేకాదు ఆస్తులపై తమకు వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. ఒంగోలు పీటీసీ డీఎస్సీ దుర్గప్రసాద్ కేసులో విచారణ కోనసాగిస్తున్న ఏసీబీ. ఆర్కేకు కూడా నోటీసులు జారీ చేసింది. దుర్గప్రసాద్ ఆస్తులపై గతంలోనే ఏసీబీ సోదాలు చేపట్టింది. దీంతో భారీగా ఆస్తులు కూడాబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్నారు డీఎస్సీ. కాగా దుర్గాప్రసాద్ కు అక్రమాస్తులకు రామకృష్ణారెడ్డి బినామీ అనే ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కేకు నోటీసులు జారీ చేసింది ఏసీబీ.

Show Full Article
Print Article
Next Story
More Stories