వైసీపీ ఎమ్మెల్యే పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీ ఎమ్మెల్యే పై ఏసీబీ కేసు నమోదు
x
Highlights

వైసీపీ ఎమ్మెల్యేపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు బెట్టింగ్ ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని గతంలో రాష్ట్ర డీజీపీకి లేక రాశారు ఎస్పీ రామకృష్ణ, ...

వైసీపీ ఎమ్మెల్యేపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు బెట్టింగ్ ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని గతంలో రాష్ట్ర డీజీపీకి లేక రాశారు ఎస్పీ రామకృష్ణ, దీంతో విచారణ చేపట్టాల్సిందింగా ఏసీబీ డీజీ ఠాకూర్ కు బాధ్యతలు అప్పగించారు డీజీపీ మాలకొండయ్య.. వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజులుగా క్రికెట్ బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. అంతేకాదు మే 12 తమ ఎదుట హాజరు కావాలని ఎమ్మెల్యేకు తెలిపింది. అయన గతంలో భారీగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడ్డారని, బెట్టింగ్ ముఠాతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని విజయవాడలో వారికీ బస ఏర్పాటు చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇదిలావుంటే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తనపై కుట్రపన్ని ప్రభుత్వమే తప్పుడు పత్రాలను సృష్టిస్తోందని మండిపడ్డారు శ్రీధర్ రెడ్డి. ప్రతిపక్ష ఎమ్మెల్యేనైనా తనను నాలుగేళ్ల నుంచి తీవ్రంగా వేధిస్తున్నారని అన్నారు. దీనిపై తమ అధినేతతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories