బీజేపీకి షాక్‌...ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌‌దే గెలుపు!

బీజేపీకి షాక్‌...ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌‌దే గెలుపు!
x
Highlights

త్వరలో జరగనున్న మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదా ? కాషాయ దళానికి ఓటర్లు షాకివ్వనున్నారా ? రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లలో...

త్వరలో జరగనున్న మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదా ? కాషాయ దళానికి ఓటర్లు షాకివ్వనున్నారా ? రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ పార్టీ ఫుల్ మెజార్టీ సాధిస్తుందా ? నాలుగేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ బాగా పుంజుకుందా ? ఎన్నికల ముందే చేసిన సర్వేల్లో ఓటర్లు ఏం చెప్పారు. హ్యాట్రిక్‌ వీరులకు ఓటమి తప్పదా ?

ఈ ఏడాది చివరిలో జరగనున్న మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఏబీపీ-సీ ఓటర్ సంస్థ సర్వే నిర్వహించింది. హిందీ బెల్ట్ రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించనున్నట్లు సర్వేలో తేలింది. నాలుగు నెలల క్రితం జరిపిన సర్వేలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోతుందని ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని తేలింది. ఛత్తీస్‌గఢ్‌ ఎర్పాటైనప్పటి నుంచి బీజేపీ వరుసగా విజయం సాధిస్తున్నా ఈ సారి మాత్రం బీజేపీకి భంగపాటు తప్పదని సర్వేలో తేలింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ గెలుపునకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.

2వందల అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో 2013 ఎన్నికల్లో 163 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో 21 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్‌ విపరీతంగా పుంజుకుంది. త్వరలో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ 130 సీట్లలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 33శాతం ఓట్లను 50శాతానికి పెంచుకుంది. అటు 90 నియోజకవర్గాలున్న ఛత్తీస్‌గఢ్‌‌లోనూ బీజేపీకి ఓటర్లు షాకివ్వనున్నారు. రాష్ట్రం ఏర్పాటయినప్పటి నుంచి బీజేపీ వరుసగా విజయం సాధిస్తూనే ఉంది. తొలిసారి ఆ పార్టీకి ఓటమి తప్పదని సర్వేల్లో తేలింది. గత ఎన్నికల్లో 49 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో 33 సీట్లకు పరిమితం కానుంది. కాంగ్రెస్‌ పార్టీ 54 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

మరోవైపు మధ్యప్రదేశ్‌‌లో హ్యాట్రిక్‌ కొట్టిన సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌‌‌కు ఓటమి తప్పేలా లేదు. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో 2013లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 165 స్థానాల్లో విజయం సాధించి శివరాజ్‌ సింగ్‌ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 58 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ నాలుగేళ్లలో బాగా బలపడింది. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 117 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో తేలింది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 2శాతం మాత్రమే.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీదే విజయమని సర్వే వెల్లడించింది. ప్రధానిగా ఎవరు అర్హులన్న ప్రశ్నకు 53.8% మంది మోదీకే ఓటేస్తే 46.2% మంది రాహుల్‌‌కు ఓటేశారు. అంచనాల ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే లోక్‌సభ ఎన్నికల ముందు రాహుల్ గాంధీకి వెయ్యేనుగుల బలం వచ్చినట్లవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories