వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు మోహన్‌బాబు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు మోహన్‌బాబు
x
Highlights

సినీ నటుడు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్న 95శాతం మంది రాజకీయ నేతలు రాస్కెల్స్ అన్నారు. ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్‌లో...

సినీ నటుడు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్న 95శాతం మంది రాజకీయ నేతలు రాస్కెల్స్ అన్నారు. ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్‌లో పాల్గొన్న మోహన్‌బాబు సినిమాలు వేరు రాజకీయాలు వేరన్నారు. అన్న ఎన్టీఆర్‌ నిజాయితీ పరుడున్న మోహన్‌బాబు అతనికి లంచం అంటే ఏమిటో తెలియదన్నారు.

రాజకీయ నేతలు ప్రజలకు అనేక వాగ్దానాలు చేస్తారని అయితే వాటిని నిలబెట్టుకున్న ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. రాజకీయ నేతలు తమ హామీలను నిలబెట్టుకొని ఉంటే దేశం ఇలా ఉండేది కాదన్నారు. కమల్‌ రజనీకాంత్‌లతో ఉన్న అనుబంధంపై మోహన్‌బాబు మాట్లాడారు. 40ఏళ్లుగా రజనీ తనకు తెలుసని మంచి మిత్రుడన్నారు. కమల్‌తోనూ తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు.

పై చదువుల కోసం చెన్నైకి వెళ్లి చదువుకుంటూనే నటించేందుకు ప్రయత్నించానని మోహన్‌బాబు చెప్పారు. 1975లె తన జీవితం మారిపోయిందన్న భక్తవత్సల....పెళ్లయిన తర్వాత తొలి సినిమాలో నటించానన్నారు. ప్రతి నాయకుడిగా, కథానాయకుడిగా నటించానన్నారు, సినీ రంగంలో ఎన్నేళ్లు ఉంటానో తెలియక మూడు షిఫ్టులు పని చేసేవాడినన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories