గోదావరి నదిలో మరో ఘోర ప్రమాదం..

గోదావరి నదిలో మరో ఘోర ప్రమాదం..
x
Highlights

గోదావరి నదిలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌ను నాటు పడవ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ...

గోదావరి నదిలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌ను నాటు పడవ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. నదిలో మునిగిపోయిన పిల్లల కోసం రెస్క్యూ బృందాలు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి. కాగా మృతులంతా ప‌శువుల్లంకలోని పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు. నదిలో గల్లంతైన వారిని శేరిలంక‌, కె.గంగ‌వ‌రం, పామ‌ర్ల మండ‌లాలకు చెందిన వారిగా గుర్తించారు. దాదాపు 30 మంది ప్రయాణికులతో పశువుల్లంకకు వెళ్తుండగా.. వరద ప్రవాహానికి పక్కకు వెళ్లిన నాటు పడవ సిమెంట్‌ పిల్లర్‌ను ఢీకొట్టి మునిగిపోయింది. నదిలో కొట్టుకుపోతున్న 22 మందిని స్థానికులు చిన్న పడవల్లో వెళ్లి రక్షించారు. పడవలో ప్రయాణిస్తున్న మరో 8 మంది విద్యార్థులు మునిగిపోయారు. ఇక ఈ ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్షనేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories