logo
జాతీయం

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతం
X
Highlights

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్ జిల్లాలోని సెకిపొగారా ప్రాంతంలో...

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్ జిల్లాలోని సెకిపొగారా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతాదళాలపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. లష్కరే తోయిబాకు చెందిన వారిగా భావిస్తున్న ఈ ఉగ్రవాదుల గుర్తింపు వివరాలు ఇంకా తెలియరాలేదు. మరింత మంది ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో తలదాచుకున్నట్టు భావిస్తున్న భద్రతా దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

Next Story