విహారయాత్రలో విషాదం.. ఐదుగురు మృతి..

విహారయాత్రలో విషాదం.. ఐదుగురు మృతి..
x
Highlights

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి...

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద జరిగింది. నాగార్జున సాగర్ విహార యాత్ర కోసమని హైదరాబాద్‌ టోలీచౌక్‌కి చెందిన ఐదు కుటుంబాలు వేర్వేరు వాహనాల్లో వెళుతున్నారు. నసర్లపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి బస్టాండ్ గోడను ఢీకొట్టింది. దీంతో ప్రమాదం సంబంవించింది. ఈ ప్రమాదంలో మొహిన్, అక‍్బర్‌, ముస‍్తఫా, సద్దాం, సమ్మి అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories