logo
జాతీయం

సురేష్ రైనాకు తప్పిన ప్రమాదం

సురేష్ రైనాకు తప్పిన ప్రమాదం
X
Highlights

ఎత్వా: భారత క్రికెటర్ సురేష్ రైనాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. దులీప్ ట్రోఫీలో తన టీం తరపున ఆడేందుకు ఘజియాబాద్ ...

ఎత్వా: భారత క్రికెటర్ సురేష్ రైనాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. దులీప్ ట్రోఫీలో తన టీం తరపున ఆడేందుకు ఘజియాబాద్ నుంచి కాన్పూర్‌కు వెళుతుండగా రైనా ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కార్ టైర్ పేలింది. కారు తక్కువ వేగంతో వెళుతుండటంతో పక్కకు ఆగింది. అదే అతి వేగంగా వెళ్లినట్లయితే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేదని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 2.00 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాత్రి సమయంలో ఘటన జరగడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కారులో మరో టైర్ లేకపోవడంతో స్థానిక యువకులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు రైనాను వేరే కారులో అక్కడ నుంచి పంపించేశారు.

Next Story