logo
సినిమా

విడుదలకు సిద్ధమవుతున్న ‘47డేస్’

విడుదలకు సిద్ధమవుతున్న ‘47డేస్’
X
Highlights

సస్పెన్స్ థ్రిల్లర్ ముఖ్య కథాంశంగా వస్తున్న మరో చిత్రం ’47డేస్’ సత్యదేవ్, పూజా ఝవేరీ, రోహిణి ప్రకాష్ ప్రధాన...

సస్పెన్స్ థ్రిల్లర్ ముఖ్య కథాంశంగా వస్తున్న మరో చిత్రం ’47డేస్’ సత్యదేవ్, పూజా ఝవేరీ, రోహిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ప్రదీప్ మద్దాలి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచే ,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా అన్ని పనులు పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని త్రిశూల్ సినిమా ఓవర్ సీస్ హక్కులు దక్కించుకుంది. కాగా ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం సమకూర్చారు.

Next Story