ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో వినూత్న దందా.. ఒక్కో ఓటుకు రూ 10 వేల రూపాయలు..

తమిళనాడు లోని ఆర్కేనగర్ ఉప ఎన్నికలో భారీగా డబ్బులు చేతులు మారిందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. దినకరన్ వర్గం...
తమిళనాడు లోని ఆర్కేనగర్ ఉప ఎన్నికలో భారీగా డబ్బులు చేతులు మారిందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. దినకరన్ వర్గం ఒక్కో ఓటుకు సుమారు 10 వేల వరకు చెల్లించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు నిజమేనన్నట్టుగా కొన్ని ఆధారాలు కూడా బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. దినకరన్ కు సహకరించిన వారిలోనే కొంత మంది మధ్య విబేధాలు తలెత్తడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఆర్‌కే నగర్‌లో ఓటర్లకు రూ. 20ల టోకెన్లు పంపిణీ చేసిన దినకరన్ వర్గీయులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 21న జరిగిన ఆర్‌కే నగర్ ఉప ఎన్నిక పొలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల చేతుల్లో ఇరవై రూపాయల కరెన్సీనోట్లు కనిపించాయి. ఒకే వరుస నెంబర్లు కలిగిన ఆ నోట్లపై కొన్ని నెంబర్లు పెన్నుతో రాసి ఉండటం జరిగింది. ఓటేసిన తర్వాత ఆ నోటును ఓ చిరునామాదారుడి వద్ద ఇచ్చి ఓటర్లు రూ.10 వేల చొప్పున తీసుకున్నారని అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు ఇండిపెండెంట్‌గా పోటీచేసిన దినకరన్ వర్గీయులపై ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజున 450 మందికి ఆ ఇరవై రూపాయల నోట్లను టోకెన్లుగా ఇచ్చినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.
న్యూవాషర్‌మెన్ పేటకు చెందిన కార్తికేయన్ అనే ఓటరు దినకరన్ అనుచరుడైన జాన్‌పీటర్‌వద్దకు వెళ్లి తనకెందుకు ఆ టోకెన్ ఇవ్వలేదని గొడవపడ్డాడు. ఆ సందర్భంగా జాన్‌పీటర్ అతడిపై దాడి జరిపాడు. ఈ మేరకు కార్తికేయన్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపి టోకెన్లు పంచిపెట్టారనే ఆరోపణపై జాన్ పీటర్, చరణ్‌రాజ్, రవి, సెల్వం అనే నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద జరిపిన విచారణలో న్యూ వాషర్‌మెన్ పేటలో 450 మందికి రూ.20 నోట్లపై నెంబర్లు రాసి ఉన్న టోకెన్లు పంపిణీ చేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
ఉద్యోగులు పెన్షనర్లకి శుభవార్త.. రిటైర్మెంట్ చేసిన వెంటనే ప్రయోజనం..!
8 Aug 2022 4:15 PM GMTRajinikanth: రాజకీయ రంగ ప్రవేశంపై తలైవా ఏమన్నారంటే?!
8 Aug 2022 4:00 PM GMTLIC New Policy: ఎల్ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే...
8 Aug 2022 3:30 PM GMTCM Jagan: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..
8 Aug 2022 3:15 PM GMTవీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం
8 Aug 2022 3:00 PM GMT