Top
logo

తెలంగాణవ్యాప్తంగా పోలీస్ శాఖలో కలకలం

తెలంగాణవ్యాప్తంగా పోలీస్ శాఖలో కలకలం
X
Highlights

తెలంగాణ వ్యాప్తంగా పోలీసు శాఖలో కలకలంరేగింది. తెలంగాణ పోలీసు శాఖలో అవినీతిపరుల జాబితా విడుదల చేశారు. పోలీసు...

తెలంగాణ వ్యాప్తంగా పోలీసు శాఖలో కలకలంరేగింది. తెలంగాణ పోలీసు శాఖలో అవినీతిపరుల జాబితా విడుదల చేశారు. పోలీసు శాఖలో అవినీతిపరుల జాబితాను గురువారం డీజీపీ కార్యాలయం విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 391 మంది అవినీతిపరులు ఉన్నారు. సూర్యాపేటలో అత్యధికంగా 40 మంది అవినీతిపరులు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెంలో 35, కరీంనగర్ 34 మంది అవినీతిపరులు ఉన్నారు. ఇక వికారాబాద్‌లో 27, నిజామాబాద్‌లో 29 మంది అవినీతి పరులు ఉన్నారు. ఐడీ, క్రైం, స్పెషల్‌ పార్టీల పేరుతో మామూళ్లు వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. కానిస్టేబుళ్ల చేత మామూళ్లు వసూలు చేయిస్తున్న సీఐలు, ఎస్‌ఐలు, ఇతర అధికారుల పేర్లు డీజీపీ ఆఫీస్‌ వెల్లడించింది. వీరిపై చర్యలు తీసుకునేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి సిద్ధమయ్యారు. అవినీతి ఖాకీలను బదిలీ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ ఉత్తర్వులు తెలంగాణ పోలీసుల్లో సంచలనం సృష్టిస్తోంది.

Next Story