కికీ ఛాలెంజ్ తీసుకున్న ముగ్గురి తిక్క కుదిర్చిన కోర్ట్

కికీ ఛాలెంజ్ తీసుకున్న ముగ్గురు కుర్రాళ్లకు మహారాష్ట్ర పోలీసులు తిక్క కుదిర్చారు. ఈ ఛాలెంజ్ గురించి...
కికీ ఛాలెంజ్ తీసుకున్న ముగ్గురు కుర్రాళ్లకు మహారాష్ట్ర పోలీసులు తిక్క కుదిర్చారు. ఈ ఛాలెంజ్ గురించి దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నా కుర్రకారు ఆగడం లేదు. ఛాలెంజ్‌ను స్వీకరించొద్దంటూ పోలీసులు ఎంతగా చెప్పుకొస్తున్నా యూత్ దాన్ని బుర్రకెక్కించుకోవడం లేదు. మహారాష్ట్రలోని విరార్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు కికీ ఛాలెంజ్ చేశారు. కదులుతున్న రైలు నుంచి ప్లాట్ ఫామ్ పైకి దూకి డ్యాన్సులు చేశారు. దీన్నీ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
దీంతో ఒళ్లు మండిన ఆర్పీఎఫ్ పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపర్చారు. విచారించిన కోర్టు ముగ్గరికి విసాయ్ రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్‌ను వారానికి మూడు రోజుల పాటు శుభ్రం చేయాలని శిక్షించింది. అంతేకాకుండా శుభ్రం చేసే వీడియో ఫూటేజ్‌ను తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ వీడియోలను చూసిన తర్వాత ఇంకా ఏదైనా శిక్ష వేసే విషయంలో తర్వాత నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణలో ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవాలు
9 Aug 2022 5:23 AM GMTతెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMT