3 రోజులు..రూ.75 కోట్లు

3 రోజులు..రూ.75 కోట్లు
x
Highlights

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై ల‌వ‌కుశ‌'.. టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. మూడు రోజుల‌కి గానూ ఈ సినిమా రూ.75...

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై ల‌వ‌కుశ‌'.. టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. మూడు రోజుల‌కి గానూ ఈ సినిమా రూ.75 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకుంది. ఇవాళ కూడా క‌లెక్ష‌న్లు స్ట‌డీగానే ఉన్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆదివారం లేదా సోమ‌వారంతో ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు.
తార‌క్ త్రిపాత్రాభిన‌యం చేసిన 'జై ల‌వ‌కుశ‌' ఇప్ప‌టికే ఓవ‌ర్‌సీస్లో మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో చేరింది. అక్క‌డ కూడా వ‌సూళ్లు బాగున్నాయి. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సోద‌రుడు క‌ల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేదా థామ‌స్‌, రాశి ఖ‌న్నా హీరోయిన్లుగా న‌టించిన 'జై ల‌వ‌కుశ‌'కి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories