ఆ క్షణం చైతూతో ప్రేమలోపడ్డా: సమంత

ఆ క్షణం చైతూతో ప్రేమలోపడ్డా: సమంత
x
Highlights

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రేమజంట అక్కినేని నాగచైతన్య, సమంత అక్టోబరు 6న వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. గోవాలో వీరి పెళ్లి వేడుక జరగనుంది. చైతన్య, సమంత...

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రేమజంట అక్కినేని నాగచైతన్య, సమంత అక్టోబరు 6న వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. గోవాలో వీరి పెళ్లి వేడుక జరగనుంది. చైతన్య, సమంత ప్రేమలో ఉన్నారని చాలా రోజులు గుసగుసలు వినిపించినా.. ఆ విషయాన్ని గత ఏడాది కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇద్దరి పెళ్లిని నిశ్చయించినట్లు చెప్పారు. ఇటీవల చైతన్య తన సినిమా ప్రచారంలో భాగంగా విలేకరులతో మాట్లాడుతూ.. చాలా ఏళ్ల నుంచి తను, సమంత ప్రేమించుకుంటున్నట్లు చెప్పారు. కాగా ‘ఏమాయ చేసావె’ సినిమా సెట్‌లో చైతన్యను చూసిన క్షణం అతడితో ప్రేమలో పడిపోయినట్లు సమంత ఓ ఆంగ్లపత్రికతో అన్నారు. అంతేకాదు తనకు కాబోయే అత్తారింటి సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు.

‘నా ప్రకారం నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది. నేనెప్పుడూ నా సొంత ఆలోచనల్ని, నియమాల్ని పాటిస్తా. ఓ పనిని ఎప్పుడు చేస్తాను, ఎలా చేస్తాను అని చెప్పుకోవడం నాకు నచ్చదు. నాకు 30 సంవత్సరాలకు పెళ్లి అవుతుందని ఎప్పుడో తెలుసు.. ఇప్పుడు అదే జరుగుతోంది. నా జీవితం ఎలా సాగుతుందో నాకు తెలుసు అనడానికి ఇదో ఉదాహరణ’ అని సమంత చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories