భారత సంతతికి చెందిన 21 మందికి అమెరికాలో జైలు శిక్ష..

భారత సంతతికి చెందిన 21 మందికి అమెరికాలో జైలు శిక్ష..
x
Highlights

కాల్‌సెంటర్‌ పేరుతో వేల కోట్ల రూపాయలు కాజేసిన కేసులో భారత సంతతికి చెందిన 21 మందికి జైలు శిక్ష పడింది. 2012 నుంచి 2016 మధ్య జరిగిన కేసులో నాలుగేళ్లుగా...

కాల్‌సెంటర్‌ పేరుతో వేల కోట్ల రూపాయలు కాజేసిన కేసులో భారత సంతతికి చెందిన 21 మందికి జైలు శిక్ష పడింది. 2012 నుంచి 2016 మధ్య జరిగిన కేసులో నాలుగేళ్లుగా విచారణ సాగింది .భారత్ కు చెందిన కొందరు నేరగాళ్లు డేటా బ్రోకర్ల ద్వారా అమెరికాలోని వ్యక్తుల సమాచారం సేకరించి తాము అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగంనుంచి ఫోన్‌ చేస్తున్నామని నమ్మించి. ఫోన్‌ చేసిన వ్యక్తి చెప్తారు.. సమాచారమంతా నిజమే అయ్యుండటంతో బాధితులు నేరగాళ్ల మాటలు నమ్మేవారు. ఆ తరువాత పలు కారణాలతో వారు ప్రభుత్వానికి కొంత డబ్బు బాకీ పడ్డారనీ, ఆ డబ్బు చెల్లించకపోతే జరిమానాలు వేస్తామనో, అరెస్టు చేస్తామనో, దేశం నుంచి బహిష్కరిస్తామనో చెప్పి వారి వద్ద డబ్బు గుంజేవారు. ఈ క్రమంలో కొంత మంది వ్యక్తుల ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాంతో భారత సంతతికి చెందిన 21 మందిని అప్పట్లో విచారించారు. ఆపై అదుపులోకి తీసుకున్నారు.తాజాగా ఆ వ్యక్తులకు కనిష్టంగా 4 ఏళ్ల నుంచి గరిష్టంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడింది. కాగా 21 మంది ఇప్పటికే 4 ఏళ్లుగా వారు శిక్ష అనుభవిస్తున్నారు. శిక్షాకాలం పూర్తయిన వారిలో చాలా మందిని భారత్‌కు పంపనున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories