2019 ఎన్నిక‌ల్లో గెలిచేదెవ‌రో..?

2019 ఎన్నిక‌ల్లో గెలిచేదెవ‌రో..?
x
Highlights

2019 ఎన్నిక‌ల కురుక్షేత్రం ఎలా ఉండబోతుంది. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా అంటూ కేంద్రంపై పోరాటం చేస్తున్న పార్టీలపై ప్ర‌జ‌ల్లో ఉన్న సానుభూతి ఎంత..?...

2019 ఎన్నిక‌ల కురుక్షేత్రం ఎలా ఉండబోతుంది. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా అంటూ కేంద్రంపై పోరాటం చేస్తున్న పార్టీలపై ప్ర‌జ‌ల్లో ఉన్న సానుభూతి ఎంత..? ప‌్ర‌త్యేక‌హోదా పేరు చెప్పీ సింప‌తీని కొట్టేసేందుకు నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నారా..? రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ, వైసీపీ, ప‌వ‌న్, వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్‌, బీజేపీలు రాజ‌కీయ ర‌ణ‌రంగానికి ర‌ణ‌భేరులు మోగిస్తున్నాయా..? అంటే అవున‌నే అంటున్నారు పొలిటిక‌ల్ క్రిటిక్స్ .
2019ఎన్నిక‌ల కోసం అన్నీ పార్టీలు సిద్ధ‌మ‌య్యాయి. గెలుపుగుర్రాల కోసం ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా ప‌లు పార్టీలు త‌మ బ‌లాబలాలు ఎలా ఉన్నాయి. ప్ర‌జ‌లు త‌మ పార్టీకి అధికారాన్ని క‌ట్ట‌బెడ‌తారా అని సుదీర్ఘంగా చ‌ర్చిస్తున్నారు. ఇలా ర‌క‌ర‌కాల అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ఏపీకి చెందిన పార్టీలు ఏపీకి ప్ర‌త్యేక‌హోదాను అస్త్రంగా చేసుకుంటున్న‌ట్లు పొలిటిక‌ల్ క్రిటిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.
ఓవైపు ప్ర‌త్యేక‌హోదా అంటూ పోరాటం చేస్తూనే మ‌రోవైపు జిల్లాల వారిగా స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నాయి. ఆ స‌ర్వేల ఆధారంగా నేత‌ల ప‌నితీరును బేరీజు వేసుకుంటున్నారు ఆయా పార్టీల అధినేత‌లు
ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు, ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ లు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందేలా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ఇరు పార్టీల నేత‌లు ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు సానుభూతి అస్త్రాన్ని ప్ర‌జ‌ల‌పైకి వ‌దులుతున్నారు.
ఏపీకి ప్ర‌త్యేక‌హోదాపై త‌మ‌పార్టీకి చిత్త శుద్ది ఉందంటే లేదు మా పార్టీకే చిత్త‌శుద్ది ఉందంటూ ఊద‌ర‌గొట్టేస్తున్నారు. దీంతో ఇరు పార్టీ నేత‌ల క‌న్ఫ్యూజ‌న్ తో ఏపీ ప్ర‌జ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి ఓటేయ్యాలా అని డైల‌మాలోప‌డ్డారు.
ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెట్టేస్తే రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ, వైసీపీ, ప‌వ‌న్ - వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్‌, బీజేపీలు రాజ‌కీయ ర‌ణ‌రంగానికి ర‌ణ‌భేరులు మోగిస్తున్నాయి. అంటే ఐదు ముక్క‌లాట‌. ఎప్పుడైనా ఎక్క‌డైనా ఎన్నిక‌ల్లో రెండే ర‌కాల ఓట్లు ఉంటాయి. ఒక‌టి అధికార‌ప‌క్షం ఓటు రెండోది ప్ర‌తిప‌క్షం ఓటు. చంద్ర‌బాబు ఓటు ఎలాగూ ఆయ‌న‌కు ఉంటుంది. విప‌క్షాల ఓట్లు మాత్రం న‌లుగురి మ‌ధ్య నాలుగు ర‌కాలుగా నాలుగు దిశ‌ల్లో చీలిపోనున్నాయి. దీంతో ఏ పార్టీ విజ‌యం సాధిస్తుందే చెప్ప‌డం చాలా క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. పైన‌ల్ గా వ‌చ్చే ఎన్నిక‌లు టగ్ ఆఫ్ వార్ గా ఉండ‌బోతుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories