సిల్వర్ క్వీన్ నుంచి గోల్డెన్ గాళ్ గా సింధు

సిల్వర్ క్వీన్ నుంచి గోల్డెన్ గాళ్ గా సింధు
x
Highlights

ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో భారత స్టార్ ప్లేయర్, తెలుగుతేజం పీవీ సింధు ఎట్టకేలకు ఫైనల్ ఫోబియాను అధిగమించింది. సిల్వర్ స్టార్ నుంచి గోల్డెన్...

ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో భారత స్టార్ ప్లేయర్, తెలుగుతేజం పీవీ సింధు ఎట్టకేలకు ఫైనల్ ఫోబియాను అధిగమించింది. సిల్వర్ స్టార్ నుంచి గోల్డెన్ గాళ్ స్థాయికి చేరింది. గత రెండేళ్లుగా ఓ వింత ఫోబియాతో సతమతమైన సింధు.. 2018 బ్యాడ్మింటన్ ఫైనల్స్ టైటిల్ తో పాటు బంగారు పతకం అందుకొని విమర్శకులకు తనదైన స్టయిల్లో సమాధానం చెప్పింది.

పీవీ సింధు ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్లో భారత మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడిస్తున్న ఒకే ఒక్క తెలుగుతేజం. ప్రపంచ కప్ చరిత్రలోనే నాలుగుసార్లు సెమీఫైనల్స్ చేరి రెండు రజత, రెండు కాంస్య పతకాలు సాధించిన ఒకే ఒక్క భారత మహిళ సింధు. చైనా లోని గాంగ్జులో ముగిసిన 2018 BWF టోర్నీలో సిందు ివిశ్వరూపమే ప్రదర్శించింది. ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ మొదటి ఎనిమిదిమంది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ల నడుమ జరిగిన ఈ టోర్నీ లీగ్ దశలో ప్రపంచ నంబర్ వన్ తాయి జింగ్ ను, యమగుచిని, సెమీఫైనల్లో ప్రపంచ మాజీ విజేత రచనోక్ ను, ఫైనల్లో 5వ ర్యాంకర్ నజోమీ ఒకుహరాలను చిత్తు చేయడం ద్వారా తొలిసారిగా ట్రోఫీతో పాటు బంగారు పతకం అందుకొంది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా సింధు చరిత్ర సృష్టించింది.

గత ప్రపంచ బ్యాడ్మింటన్ టూర్ ఫైనల్స్ లో ఒకుహరా చేతిలో ఓటమి పొందిన సింధు.. ప్రస్తుత టోర్నీ ఫైనల్స్ చేరడమే కాదు టైటిల్ నెగ్గి బదులు తీర్చుకోగలిగింది. అయితే ప్రపంచ మేటి బ్యాడ్మింటన్ టోర్నీల ఫైనల్స్ వరకూ రావటం....టైటిల్ సమరంలో పరాజయాలు పొందటం సింధు పాలిట శాపంగా మారినా 2018 సీజన్ ముగింపు దశలో ఆ బలహీనతను సింధు అధిగమించగలిగింది. 2016 రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో కారోలినా మారిన్ చేతిలో ఓటమి పొందిన సింధు...ఆ తర్వాత ఆడిన ఎనిమిది ప్రధానటోర్నీల్లోనూ రజత పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తొమ్మిది టోర్నీ లో మాత్రం ఫైనల్ ఫోబియాను అధిగమించి బంగారు పతకంతో విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది.

2016, 2017 హాంకాంగ్ ఓపెన్, 2017 దుబాయ్ సూపర్ సిరీస్ , 2018 ఇండియన్ ఓపెన్, థాయ్ లాండ్ ఓపెన్, 2018 కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్స్ , 2017, 2018 ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్స్ లో సైతం 2018 ఆసియా క్రీడల ఫైనల్స్ లో సైతం సింధుకు చేదుఅనుభవాలే ఎదురయ్యాయి. ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్లో ప్రమాణాలు అనూహ్యంగా పెరగటం, చైనా, జపాన్, చైనీస్ తైపీ, కొరియా, స్పెయిన్ దేశాల ప్లేయర్ల నుంచి గట్టిపోటీ ఎదురుకావడం హోరాహోరీగా సాగే
పోటీలలో మూడుగేమ్ ల పాటు పోరాడే సత్తా సింధులో లేకపోడమే స్వర్ణం సాధించలేకపోడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే...ప్రస్తుత సీజన్ BWF టోర్నీలో మాత్రం తొలిరౌండ్ నుంచే దూకుడుగా ఆడుతూ, వరుస గేమ్ ల విజయాలతో ...సింధు తానేమిటో నిరూపించుకొని టోక్యో ఒలింపిక్స్ స్వర్ణానికి సిద్ధమని ప్రకటించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories