logo
సినిమా

2.0 కు భారీ కలెక్షన్లు.. ఒక్క హిందీలోనే..

2.0 కు భారీ కలెక్షన్లు.. ఒక్క హిందీలోనే..
X
Highlights

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో.. అగ్రదర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో విజువల్‌...

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో.. అగ్రదర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన 2.0 అన్ని రికార్డులను తిరగరాస్తూ 10 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. తెలుగు, తమిళ్, హిందీలో 150 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి.. ఒక్క హిందీలోనే మొదటిరోజు రూ.22 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, బాహుబలి2, కబాలి చిత్రాలకు వచ్చిన రికార్డులను అధిగమించే దిశగా 2.0 ముందుకు వెళుతోంది. ఈ వారాంతానికి 300 కోట్లు పైగానే షేర్ వసూలు చేసే అవకాశమున్నట్టు సినీ పండితులు అంటున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ప్రముఖ సినీ విమర్శకుడు, యూకే సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు.. 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇదొక గొప్ప చిత్రంగా అభివర్ణించాడు.

Next Story