టెస్టు క్రికెట్ చరిత్రలో రెండోసారి..!

టెస్టు క్రికెట్ చరిత్రలో రెండోసారి..!
x
Highlights

పల్లెకెలె:భారత-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పల్లెకెలె స్టేడియంలో శ్రీలంకతో టెస్టు మ్యాచ్ లో భారత్...

పల్లెకెలె:భారత-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పల్లెకెలె స్టేడియంలో శ్రీలంకతో టెస్టు మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగగా, శ్రీలంక మూడు మార్పులు చేసింది. ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటున్న జడేజా స్థానంలో భారత చైనామన్ బౌలర్(ఎడమచేతి మణికట్టు స్పిన్నర్) కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోగా, శ్రీలంక తుది జట్టులోకి ధనుంజయ, హెరాత్, నువాన్ ప్రదీప్ స్థానాల్లో లక్షణ్ సండకన్, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండోలు వచ్చారు. అయితే లక్షణ్ సండకన్ చైనామన్ బౌలర్ కావడమే అరుదైన సన్నివేశానికి వేదికైంది.

ఒక టెస్టు మ్యాచ్ లో ఇద్దరు చైనామన్ బౌలర్లు ఒకేసారి ఆడటం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. అంతకుముందు 2004లో వెస్టిండీస్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ లో జరిగిన టెస్టు మ్యాచ్ లో మొదటిసారి జరిగింది. విండీస్ చైనామన్ బౌలర్ డేవ్ మొహ్మద్ తో పాటు దక్షిణాఫ్రికా చైనామన్ బౌలర్ పాల్ ఆడమ్స్ లు చివరిసారి ఒకే మ్యాచ్ లో ఆడారు. ఆ తరువాత ఇద్దరు చైనామన్ బౌలర్లు ప్రత్యర్థి జట్లలో ఆడటం ఇదే తొలిసారి. ఇప్పుడు సండకన్, కుల్దీప్ లు చైనామన్ బౌలర్ లుగా బరిలోకి దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories