12 ఏళ్ల చెవిటి బాలికపై 17 మంది అత్యాచారం

తమిళనాడులోని ఐనవరంలో దారుణం జరిగింది. 12 ఏళ్ల వినికిడి లోపం ఉన్న బాలికపై 6 నెలలుగా 17 మంది అత్యాచారానికి...
తమిళనాడులోని ఐనవరంలో దారుణం జరిగింది. 12 ఏళ్ల వినికిడి లోపం ఉన్న బాలికపై 6 నెలలుగా 17 మంది అత్యాచారానికి పాల్పడుతున్నారు. బాలికకు మత్తు మందు ఇచ్చి లిఫ్టులు, బాత్‌రూమ్‌లలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక అనారోగ్యానికి గురి కావడంతో విషయం బయటపడింది.
దివ్యాంగురాలైన మైనర్ బాలికపై మానవ మృగాలు పైశాచికానికి పాల్పడ్డాయి. 12 ఏళ్ల బాలికపై 17 మంది కామాంధులు అత్యాచారం జరిపారు. మత్తుమందు ఇచ్చి ఆ బాలికపై అత్యాచారం చేశారు. అపార్ట్‌మెంట్‌లో పనిచేసే వాచ్‌మెన్, లిప్ట్ ఆపరేటర్లు, పనిమనుషులే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికపై కన్నేసిన లిప్ట్ ఆపరేటర్ బాలిక పాఠశాల నుంచి తిరిగి వచ్చే క్రమంలో అపార్ట్‌మెంట్‌లో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత అతని స్నేహితులను పిలిచి సామూహికంగా అత్యాచారం చేయడం మొదలు పెట్టారు. తర్వాత వారి స్నేహితులను పిలిచి ఇలా 17 మంది ఆ బాలికను దారుణంగా అత్యాచారాం చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో బాలికకు మత్తుమందు ఇస్తూ అరవకుండా చేస్తూ వచ్చారు. బాలిక నగ్న ఫోటోలు చూపించి ఇంట్లో చెబితే అందరికీ చూపిస్తామని బెదిరించారు.
బాలిక అక్క సెలవులకు ఈ నెల 13న చెన్నై రావడంతో ఒక్కో విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న బాలికను గమనించి అక్క విషయాన్ని పసిగట్టింది. తన చెల్లికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుంది. వెంటనే ఆ దారుణాన్ని తన తల్లిదండ్రుల తెలియజేసింది. తమ కూతురుకి జరిగిన దారుణాన్ని వారు పోలీసులకు తెలియజేశారు. లిప్ట్ ఆపరేటర్ రవి తన కూతురిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ మెదలెట్టిన పోలీసులు బాలిక చూపించిన 17మందిని అరెస్ట్ చేసి సైదాపేట న్యాయస్థానం హాజరు పరిచారు.
దివ్యాంగురాలైన ఆ బాలిక పట్ల అంత దారుణానికి వడికట్టిన 17మంది కామాంధులను సైదాపేట కోర్టు న్యాయవాదులు పిచ్చికుక్కలను కొట్టినట్లు కొట్టారు. కోర్టు లోపలికి వచ్చిన నిందితులు తమ తరఫున వాదించాలని లాయర్లను కోరేందుకు వెళ్లారు. అయితే ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన న్యాయవాదులు మూకుమ్మడిగా నిందితులపై దాడికి దిగారు. పై అంతస్థు నుంచి కొట్టుకుంటూ కిందకు వచ్చారు. పోలీసులు ఆ దుర్మార్గులను రక్షించి జైలుకు తరలించారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT