logo
జాతీయం

ఒకే ఇంట్లో 11 మృతదేహాల కలకలం..

ఒకే ఇంట్లో 11 మృతదేహాల కలకలం..
X
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. బురారీలోని ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఏడుగురు...

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. బురారీలోని ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఒకే ఇంట్లో అంతమంది మరణించారనే వార్త.. కలకలం రేపుతోంది. అందరూ ఉరి వేసుకుని ఉండి. కళ్లు, నోళ్లు కట్టేసి ఉండడం పలు అనుమానాలను కలిగిస్తోంది. మృతుల కుటుంబానికి ఫర్నిచర్ , కిరాణా దుకాణాలున్నాయి. వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారా.. లేక .. ఎవరైనా హత్య చేసారా అన్న దానిపై విచారణ సాగుతోంది. మృతులు కొంతకాలంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

Next Story