ప్రసాదం తిని 11 మంది మృతి..

కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలుషితమైన ప్రసాదం తిని 11 మంది మృతి చెందగా 72 మందికి...
కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలుషితమైన ప్రసాదం తిని 11 మంది మృతి చెందగా 72 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. పలువురి పరిస్థితి సీరియస్ గా ఉంది. కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లాలోని సులవది గ్రామంలో మారెమ్మ ఆలయంలో గోపురం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు వందలాది మంది భక్తులు హాజరయ్యారు. తర్వాత ఆలయంలో తయారుచేసిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.
ప్రసాదం తిన్న కాసేపటికే భక్తులు తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే బాధితులను దగ్గరల్లోని హాస్పిటల్స్‌కు తరలించారు. 11 మంది మృతి చెందారు. మృతుల్లో 15 ఏళ్ల బాలిక కూడా ఉంది. అస్వస్థతకు గురైన 72 మందిలో పన్నెండు మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ప్రసాదం శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ప్రసాదంలో విషం కలిసినట్లు అనుమానిస్తున్నారు. ఆసుపత్రిలో బాధితులను కర్ణాటక సీఎం కుమారస్వామి పరామర్శించారు. దీన్నో దురదృష్టకర సంఘటనగా కర్ణాటక సీఎం కుమారస్వామి చెప్పారు. బాధితులకు సరైన వైద్య సాయం అందించాల్సిందిగా ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...
14 Aug 2022 4:00 PM GMTహైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్...
14 Aug 2022 3:00 PM GMTపేద విద్యార్థులకు ఉప్పల ట్రస్టు సహకారం
14 Aug 2022 2:30 PM GMT3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్
14 Aug 2022 2:00 PM GMTసోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
14 Aug 2022 1:30 PM GMT