Kishan Rail: అనంతపురం నుండి ' కిసాన్ రైల్ స్పెషల్ ' నిర్వహణకు ప్రతిపాదన

గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో రైతులు , వ్యాపారులు ఎగుమతిదారుల కోరిక మేరకు అనంతపురం నుండి ' కిసాన్ రైల్ స్పెషల్ ' నిర్వహణకు ప్రతిపాదన...

2020 - 21 బడ్జెట్ ప్రకారం రైతులకు ప్రయోజనం కల్పించేందుకు సరైన మార్కెట్ మరియు ధరలను కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే కిసాన్ రైల్ స్పెషల్ లను ప్రకటించింది .

దీనిలో భాగంగా గుంతకల్లు డివిజన్ పరిధిలో అనంతపురం నుండి ఉత్తరాది రాష్ట్రాలకు వ్యసాయ ఉత్పత్తులను రవాణా చేసే అంశంపై రైతులు ప్రజాప్రతినిధులు తో సమావేశం నిర్వహించారు...

ఈ సమావేశంలో గుంతకల్లు డివిజన్ డిఆర్ఎమ్ అలోక్ తివారి అనంతపురం ఎంపీ తలారి రంగన్న , అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి , రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు...

అనంతపురం లో ప్రధానంగా తీపి నిమ్మ , దానిమ్మ . పుచ్చకాయలు మొదలైన పండ్లతో పాటు కూరగాయలు సాగు చేస్తుంటారు..

ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీ , ఉత్తరప్రదేశ్ , మధ్య ప్రదేశ్ , రాజస్తాన్ , హర్యాన , పంజాబ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఈ సరుకు రవాణా చేయడం జరుగుతుంది...

ఈ పండ్లు గమ్యస్థానం చేరేలోగా చెడిపోయే అవకాశం కూడా ఉంది..

ఈ విషయంలో డివిజనల్ రైల్వే అధికారులు పండ్ల ఉత్పత్తులను రైల్వే ద్వారా రవాణా చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి సమావేశంలో వివరించారు ...

అనంతపురం జిల్లాలోని వివిధ స్టేషన్లనుండి ఉత్తరాది రాష్ట్రాలకు కిసాన్ స్పెషల్ రైళ్ళను నడిపే అవకాశాల గురించి చర్చలు జరిగాయి.

రైతులు , వ్యాపారులు ప్రధానంగా అక్టోబర్ - మే వరకు రోజువారి రైళ్లను నడపాలని కోరారు..

మిగతా నెలల్లో వీక్లి లేదా బైవీక్లీ రైళ్ళను అనంతపురం , ధర్మవరం, తాడిపత్రి రైల్వే స్టేషన్ల నుండి నడపాలని వారు కోరారు .

అదేవిధంగా ఈ రైళ్ళను మార్గ మధ్యంలో భోపాల్ మరియు ఝాన్సీల వద్ద లోడింగ్ / అన్లోడింగ్ కోసం ఆపాలని కోరారు..

రైల్వే పరికరాల్లో శీతల గిడ్డంగులు మరియు రిఫ్రిజిరేటెడ్ ఫార్మల్ వ్యాన్లను వ్యవసాయ ఉత్తత్తులు పాడవకుండా రవాణకోసం ఏర్పాటుచేయాలని కోరారు

ప్రస్తుతం రేణిగుంట నుండి పాల వ్యాగన్లను నడుపుతున్న రీతిలో అనంతపురం నుండి కూడా ఈ తరహా పాల వ్యాగన్లను నడపడానికి అవకాశాలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories