Hyderabad Weather Updates: 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది: ఐఎండి డైరెక్టర్ హైదరాబాద్

- ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నైరుతి జార్ఖండ్ లో కేంద్రీకృతమై ఉంది దీనికనుగుణంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది...

- దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి...

- ఈ ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాల్లో ఒకటి ,రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..

- తెలంగాణ జిల్లాలో రేపు ,ఎల్లుండి తేలికపాటి వర్షాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాలో రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది....

- ఈరోజు ప్రత్యేకంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మల్కాజిగిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి,జనగామ ,సూర్యాపేట, నల్గొండ, వరంగల్ జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

- కోస్తాంధ్ర లో ఇవాళ ,రేపు ఎల్లుండి తేలికపాటి వర్షాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇవాళ ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

- దక్షిణకొస్తా, రాయలసీమ జిల్లాలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది..

- దక్షిణ కోస్తాలో ఇవాళ ఒకటి ,రెండు చోటక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..

- హైదరాబాద్ లో ఇవాళ ,రేపు తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి ,రెండు చోట్లా భారీ జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది..

- నైరుతి రుతుపవనాల కాలంలో ఇప్పటి వరకు తెలంగాణ సాధారణం కన్నా 47 శాతం అధికంగా ఒక వరంగల్ పట్టణంలో నే సాధారణం కన్నా 150 శాతం అధికంగా,నిర్మల్ జిల్లాలో 11 శాతం లోటు వర్షపాతం నమోదైంది...

- కోస్తాంధ్ర లో సాధారణం కన్నా 47 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది...

Show Full Article
Print Article
Next Story
More Stories