Fire Accident in Sanga Reddy tires factory: సంగారెడ్డి జిల్లాలోని టైర్ల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగులో టైర్ల ఫ్యాక్టరీ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

దాంతో భారీగా పొగలు, మంటలతో ఆ ప్రాంతం కమ్ముకుపోయింది.

దాంతో గుమ్మడిదల గ్రామ ప్రజలు భయంతో పరుగులు తీశారు.

పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.  

ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 

గుమ్మడిదల ప్రాంతంలో ఎక్కువగా కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నట్టు తెలుస్తోంది. షాట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రమాదంలో ఎంత నష్టం జరిగింది.? గోడౌన్‌లో ఎంత మంది ఉన్నారు?. అనే విషయాలు తెలియాల్సి ఉంది. 

Show Full Article
Print Article
Next Story
More Stories