>> అమరావతి- వైద్య, ఆరోగ్యశాఖ రీట్వీట్- కరోనా... ... Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

>> అమరావతి

- వైద్య, ఆరోగ్యశాఖ రీట్వీట్

- కరోనా టెస్ట్ ల విషయంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

- RT PCR టెస్ట్ లో' కచ్చితత్వం శాతం 67 శాతం మాత్రమే.

- అంటే సంబంధిత వ్యక్తిలో 33 శాతం వైరస్ ఉనికి ఉన్నప్పటికీ టెస్ట్ ఫలితాలు నెగటివ్ అనే చూపుతాయి

- ఆ వ్యక్తిలో కోవిడ్ వైరస్ 100 శాతం కచ్చితంగా వుంటే ఫలితాలు పాజిటివ్ అని నిర్ధారిస్తాయి.

- అంటే ఆ వ్యక్తిలో కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా వుందని అర్థం.

- పేషెంట్ రికవరి దశలో వున్నప్పుడు (అంటే వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన కొద్ది రోజుల తరువాత) టెస్ట్ ఫలితాలు నెగటివ్ అని చూపుతాయి.

[- దీపక్ రెడ్డి విషయంలో తొలి టెస్ట్ ఫలితాలు పాజిటివ్ అని చూపాయంటే, ఆయన నూరుశాతం వైరల్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారని అర్ధం.

- రెండో టెస్ట్ నెగటివ్ అని చూపిందంటే అందుకు రెండు కారణాలుంటాయి

- ఆయనలో వైరల్ ఇన్ఫెక్షన్ స్థాయి 33 శాతం మాత్రమే వుండటం లేదా ఆయన రికవరీ దశలో వుండటం

- ఈ దశలో కరోనా టెస్ట్ ఫలితాలు నెగటివ్ అన్న ఫలితాలనే చూపుతాయి

- సాంకేతికపరమైన ఈ అంశాలపై స్పందించటానికి ముందు సంబంధిత వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎపి వైద్య ఆరోగ్య శాఖ కోరుతోంది

- ఆయా వ్యక్తులు బాధ్యతా రహితంగా చేసే ఇటువంటి వ్యాఖ్యలు ల్యాబ్స్ లో పనిచేస్తున్న సంబంధిత సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి

- ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజల దృష్టిలో అనుమానాలు రేకెత్తించటం ఎవరికీ మంచిది కాదనే విషయాన్ని వారు గ్రహించాల్సిన అవసరం ఉంది

@ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

Show Full Article
Print Article
Next Story
More Stories