Balasubrahmanyam: బాల సుబ్రహ్మణ్యం గారికి హృదయంతో నా కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను: ఆళ్ల నాని!

పశ్చిమగోదావరి జిల్లా..ఏలూరు..

రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...

-సంగీత దర్శుకుడు, నటుడు, ప్రపంచం గర్వించదగ్గ పండితా రాడ్యు లు, గాన గంధర్యులు బాల సుబ్రహ్మణ్యం....

-మావూరు మణి..అని ముద్దుగా పిలవమనే గానగంధర్వుడు...ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు,నటుడు,.ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం ఆకస్మిక మృతికి తీవ్ర     విచారం.

-బహుముఖ ప్రజ్ఞాశాలి,భారతీయ సంగీత చరిత్రలో ఒక మైలు రాయిలా నిలిచిన మన బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే మాట నమ్మలేకున్నాను

-భారతీయ చలనచిత్ర రంగంలో తనదంటూ ప్రత్యేక శైలి ఏర్పాటు చేసుకొని సుమారు 40 వేల పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేకున్నా ఆయన   పాడిన పాటలలో ఆయన మనతో జీవించి వుంటారు.

-ఆయన ఆత్మకు శాంతి కలగాలని,వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనో నిబ్బరం కలిగించాలని కోరుకుంటున్నాను...

-సినిమాల్లోనే కాక టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా... పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నూతన గాయకులను పరిచయం     చేసాడు...

-బాల సుబ్రహ్మణ్యంకు భారత దేశ కేంద్ర ప్రభుత్వం నుండి 2001లో పద్మ శ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు...

-ఏడ్చినా.. నవ్వినా.. నీరసపడినా.. ఉత్సాహం నిండినా.. స్ఫూర్తి పొందినా.. ప్రతి ఒక్క సందర్బా నికి ఆయన పాట ఒకటుందన్నారు.

-గాయకునిగా, వ్యాఖ్యతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, బహుముఖ ప్రజ్ఞ కలిగిన బాల సుబ్రహ్మణ్యం కారణ జన్ములుగా అభివర్నించిన మంత్రి ఆళ్ల నాని.

Show Full Article
Print Article
Next Story
More Stories