Avanthi Srinivas Comments: గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రొత్సహిస్తాం..

అమరావతి

* అవంతి శ్రీనివాస్, టూరిజం శాఖ మంత్రి కామెంట్స్:

* విశాఖ బీచ్ రోడ్డులో టూరిజం శాఖ తరపున కోడి రామ్మూర్తి విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం.

* ఆంధ్ర హెర్కుల స్ గా పేరొందిన కోడి రామ్మూర్తి విగ్రహం ఏర్పాటు చేస్తే యువతకు స్పూర్తిగా ఉంటుంది.

* 13 జిల్లాల్లో 13 అంతర్జాతీయ స్థాయి స్టేడియాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం.

* పీపీపీ పద్దతిన అంతర్జాతీయ స్టేడియంల నిర్మాణం

* పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే.

* పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని ప్రధానే అన్నారు.

* పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు తగవు.

* కేంద్రంపై ఒత్తిడి తేవడానికి చంద్రబాబు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది.

* బీసీలకు గుర్తింపునిస్తూ కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తే బీసీలను విడగొడతున్నామని విమర్శలు చేస్తున్నారు.

* కులమంటే చంద్రబాబు కులమేనా..? బీసీలవి కులాలు కాదా..?

* కరోనా పేరు చెప్పి హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు మళ్లీ ఎన్నికలకే ఏపీకి వస్తారు.

* విశాఖకు కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ ఓడలో రెస్టారెంట్ ప్రారంభించే ప్రతిపాదన.

* ఇప్పటికే విశాఖలో విమానం, సబ్ మెరైన్ వంటివి పర్యాటకంగా ఆకర్షిస్తున్నాయి.

* వీటితో పాటు తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడను కూడా పర్యాటకానికి వినియోగించుకోవాలని భావిస్తున్నాం.

* బంగ్లాదేశ్ ఓడకు చెందిన యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నాం.

* విశాఖలో సీ-ప్లేన్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాం.

*  గత ప్రభుత్వం కృష్ణా నుంచి నాగార్జున సాగరుకు సీ-ప్లేన్ ప్రతిపాదనలు పంపింది.

* టూరిజం బోట్లను పూర్తి స్థాయిలో అనుమతించాలని నిర్ణయం.

* పాపికొండలు, ప్రకాశం బ్యారేజ్ మినహా అన్ని చోట్ల బోటింగుకు అనుమతిస్తున్నాం.

* రాష్ట్రంలో 13 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు చర్యలు.

* ఓబెరాయ్ వంటి ప్రముఖ హోటల్ యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నాం.     

Show Full Article
Print Article
Next Story
More Stories