Ambedkar Statue: రాజ్యాంగ నిర్మాత బీ ఆర్ అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి సంబంధించి జీవో విడుదలైంది..

మంత్రుల ప్రెస్ మీట్ @ అసెంబ్లీ హాల్ 1:

మంత్రులు ఈటెల రాజేందర్ ,కొప్పుల ఈశ్వర్ ,సత్యవతీ రాథోడ్ ,ప్రభుత్వ విప్ బాల రాజు ,రేగా కాంతా రావు ,ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ ప్రెస్ మీట్ @ అసెంబ్లీ హాల్ 1

మంత్రి కొప్పుల ఈశ్వర్

-ఈ రోజు శుభదినం ..

-బాబా సాహెబ్ 125 వ జయంతి సందర్భంగా సీఎం కెసిఆర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు

-ఈ భారీ విగ్రహం ఏర్పాటు కు అనుమతులకు సంబంధించి జీవో నంబర్ 2 విడుదలైంది

-ఇందు కోసం 140 కోట్ల రూపాయల ఖర్చవుతుంది

-హుస్సేన్ సాగర్ సమీపం లో 11 ఎకరాల స్థలం లో అంబెడ్కర్ పార్కు ఏర్పాటు అవుతుంది

-ఈ పార్కు లో విగ్రహం తో పాటు ,మ్యూజియం ,లైబ్రరీ కూడా ఉంటాయి

-సీఎం కెసిఆర్ కు దళిత ,గిరిజన ,మైనారిటీ వర్గాలు రుణ పడి ఉంటాయి

-విగ్రహం వెడల్పు 45 .5 ఫీట్లు

-ఈ విగ్రహానికి వాడే స్టీలు 791 టన్నులు

-విగ్రహానికి వాడే ఇత్తడి ...96 మెట్రిక్ టన్నులు

-అంబెడ్కర్ విగ్రహ నమూనాను మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు

Show Full Article
Print Article
Next Story
More Stories