Amaravati Updates: టి.డి.పి. సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్..

అమరావతి..

-పాల్గొన్న 175నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, టిడిపి ప్రజా ప్రతినిధులు

-అన్నం పెట్టే రైతన్నలకు సంకెళ్లు వేసిన రాష్ట్రంగా ఏపికి దేశవ్యాప్తంగా చెడ్డపేరు తెచ్చారు...

-రైతులకు సంకెళ్లు వేయడాన్ని Lనిరసిస్తూ ఆందోళనల ద్వారా వైసిపి రైతాంగ వ్యతిరేక చర్యలను రాష్ట్రవ్యాప్తంగా గర్హించారు.

-176చోట్ల గృహ నిర్బంధాల ద్వారా, దీనిని విఫలం చేయాలని వైసిపి నాయకులు ప్రయత్నించి భంగపడ్డారు.

-వరద ప్రాంతాల్లో అడుగుపెట్టని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరో చరిత్ర.

-గాల్లో తిరిగి చేతులు దులుపుకున్నాడే తప్ప నేలపై అడుగు పెట్టలేదు.

-రేషన్ సరుకుల పంపిణీకి, ముంపు రోజులకు ముడిపెట్టిన సిఎంగా జగన్మోహన్ రెడ్డి ఇంకో చరిత్ర.

-రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేసిన జెఏసి నాయకులపై, మహిళలపై దాడిని, అక్రమ కేసులను ఖండిస్తున్నాం.

-రివర్స్ టెండర్ల పేరుతో పోలవరం పనులు ఆపేశారు.

-అంచనాల పెంపులో అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలు చేశారు.

-వైసిపి చేసిన తప్పులే రాష్ట్రం మెడకు చుట్టుకున్నాయి.

-టిడిపిపై బురద జల్లడంపై శ్రద్ద, పోలవరం పనుల పూర్తిపై పెట్టడం లేదు.

-కేంద్రాన్ని ఒప్పించి పనులు త్వరితగతిన పూర్తిచేసే దిశగా చర్యలు లేవు.

-వైఎస్ హయాంలో పోలవరంపై ఖర్చు చేసింది కేవలం రూ 400కోట్లు మాత్రమే..

-టిడిపి 5ఏళ్లలో రూ11వేల కోట్లు పోలవరంపై ఖర్చు చేశాం, 71% పనులు పూర్తి చేశాం, నీటిపారుదల ప్రాజెక్టులపై రూ64వేల కోట్లు ఖర్చు చేశాం.

-రాష్ట్రానికి తీరని నష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories