Amaravati updates: ప్రధానితో ఏం చర్చించారో, ప్రజలకు చెప్పకపోతే ఎలా?...

అమరావతి..

ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు..

-జగన్మోహన్ రెడ్డి ప్రధానితో ఏం చర్చించారని ప్రజలంతా అనుకుంటున్నారు.

-40 నిమిషాలపాటు వారిద్దరూ ఏం చర్చించారో, ముఖ్యమంత్రి బయటకు చెప్పకపోతే ఎలా?

-జగన్ తోకముడిచుకొని వెనక్కురావడం చూస్తుంటే, రాష్ట్రానికి నయాపైసా ప్రయోజనం జరిగే అంశాలేవీ, ఆయన ప్రధానితో చర్చించినట్టుగా లేడనిపిస్తోంది.

-ముఖ్యమంత్రి తనపై ఉన్న 31 కేసులు గురించే మోదీతో చర్చించారా?

-ముఖ్యమంత్రి పదవితో వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతూ, కేసులు మాఫీ చేయించుకోవడానికే జగన్ ఢిల్లీ వెళ్లారా...?

-రాష్ట్రానికి తెస్తానన్న ప్రత్యేకహోదా గురించి, పునర్విభజన చట్టంప్రకారం ఏపీకి రావాల్సిన వాటి గురించి జగన్ ఎందుకు మాట్లాడటం లేదు..?

-కేంద్రంతో పోరాడి ప్రత్యేకహోదా తెస్తాడనే, యువత జగన్ కు ఓట్లేశారు.

-రాష్ట్రప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు పెట్టేలా జగన్ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందో ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి.

-అధికారం ఇచ్చింది ప్రతిపక్షంపై కక్షసాధించడానికో, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టడానికో కాదనే నిజాన్ని జగన్ గ్రహించాలి.

-వైసీపీ ఎంపీలు హోదాసహా, ఇతర అంశాలపై కేంద్రంతో పోరాడటానికి ముందుకొస్తే, వారికి టీడీపీ ఎంపీలు ఎప్పుడూ అండగా ఉంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories