తాడిపత్రిలో 50శాతం కరోనా కేసులు బయటనుంచి వచ్చిన వారివే: మున్సిపల్ కమిషనర్

తాడిపత్రి: పట్టణంలో వచ్చిన కరోనా కేసులలో 50% పైగా, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుండి వచ్చిందని మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు.

- తాడిపత్రి పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి, తాడిపత్రి డిఎస్పి ఆర్ల శ్రీనివాసులు, అనంతపురం జిల్లా ఆర్డీఓ కులభూషణ్, తాడిపత్రి ఎమ్మార్వో అహ్మద్ ఒక సంయుక్త ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

- తాడిపత్రి పట్టణంలో ఇప్పటి వరకు 96 కరోనా కేసులు నమోదయ్యాయని, అధికంగా కంటోన్మెంట్ జోన్ల ప్రాంతాల నుంచే వస్తున్నాయని, వాటిని నివారించడం కోసం కఠిన చర్యలు పాటించాల్సిన అవసరం ఉందని నరసింహ ప్రసాద్ రెడ్డి తెలిపారు.

- ఈ సమావేశంలో తాడిపత్రి డిఎస్పి ఆర్ల శ్రీనివాసులు మాట్లాడుతూ... ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి కోసం, కనీస స్వీయ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. - దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి, తాడిపత్రి ప్రాంతంలో కట్టుదిట్టంగా పోలీస్, మున్సిపల్ అధికారులు మూడు నెలలపాటు గ్రీన్ జోన్ లో ఉండే విధంగా కృషి చేశారని తెలిపారు.

- ప్రస్తుత పరిస్థితుల్లో నానాటికీ పెరిగిపోతున్న కరోనా వ్యాధిని అరికట్టడం కోసం ప్రజలు ఖచ్చితంగా అధికారుల సూచనలు పాటించాల్సిందిగా డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు కోరారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories